2026లో అద్భుతం చేస్తున్న కేతువు... ఈ రాశులకు అఖండ ధనయోగం
నవగ్రహాల్లో రాహువు, కేతువు అంటే నీడ గ్రహాలని పేరు. ఛాయా గ్రహాలని కూడా పిలుస్తుంటారు. ప్రతి రాశిలో 18 నెలలు సంచారం చేస్తారు. కొత్త సంవత్సరం 2026లో కేతువు నక్షత్ర సంచారం చేస్తోంది. జనవరి నెలలో పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే మార్చి 29న మాఘ నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. దీంతో కేతువు ఒక సంవత్సరంలోనే రెండుసార్లు నక్షత్ర సంచారాన్ని పూర్తిచేస్తాడు.
ఆ సమయానికి జాతకంలో కేతువు శుభ స్థానంలో ఉంటే మంచి జరుగుతుంది. అదే జాతకంలో కేతువు బలహీన స్థానంలో ఉంటే జాతకం కూడా బలహీనపడుతుంది. అంతేకాకుండా వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. వీటిని అధిగమించాలంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు కేతువును పూజిస్తే మంచి జరుగుతుంది. సమస్యల నుంచి బయటపడతారు.

వృషభ రాశి
కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఈ సమయం అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రాశివారు కొన్ని అద్భుత కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. కీలక నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు. అదేవిధంగా విజయాలు కూడా సాధిస్తారు. వీరి ఆలోచనా తీరులో కూడా మార్పు వస్తుంది.
సింహరాశి
ఆర్థికంగా, మానసికంగా వీరికి బాగా కలిసివస్తుంది. మానసిక రోగాలన్నీ నయమవుతాయి. అనుకుంటున్న పనులు, పెండింగ్ లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఈ సమయంలో మంచి లాభాలను అందుకొని ఆర్థికంగా స్థిరపడతారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. సంపాదన కూడా ఈ రాశివారికి ఊహించనిస్థాయిలో పెరుగుతుంది.
వృశ్చిక రాశి
ప్రధానంగా టీచర్లకు బాగా కలిసివస్తుంది. అంతేకాకుండా విద్యకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి కూడా మేలు కలుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు మంచి ఫలితాలు కలుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇదే సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ పరంగా వీరికి బాగా కలిసివస్తుంది. వేధిస్తున్న సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.












Click it and Unblock the Notifications