2024 పోతూ పోతూ ఈ రాశులను కుబేరులను చేస్తోంది
నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు న్యాయదేవుడు. చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే ఆ కర్మను బట్టి ఫలితాలు ఎదురవుతాయి. శనిదేవుడు ఎంతో నీతిమంతుడు. నీతి, నిజాయితీలతో ఉండేవారిని ఆయన ఎల్లప్పుడూ అనుగ్రహిస్తుంటాడు. ఆయన ఆశీస్సులుంటే చాలు జీవితంలో తిరుగుండదు. మంచి పనులు చేసేవారికి రెట్టింపు లాభాలనిస్తాడు. ఈ నెల చివరలో పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల కొన్ని జాతకస్తుల జీవితం మారిపోనుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
తులా రాశి
ఈ రాశివారికి ఈ సమయంలో వారి పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. గౌరవ మర్యాదలు కలుగుతాయి. హోదా పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో లాభాలున్నాయి. తమ ప్రత్యర్థులపై మంచి విజయాలను నమోదు చేస్తారు. ఆర్థికంగా వనరులు పెరుగుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ లాభంతోపాటు కొత్త ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయి.

కుంభ రాశి
ఈ రాశివారికి శనిదేవుడు కొత్తగా ఆదాయ మార్గాలను ఏర్పాటు చేస్తాడు. దీనివల్ల ఆర్థికంగా బలవంతులవుతారు. జీవితంలో స్థిరపడతారు. విద్యార్థులకు మంచి విజయాలు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగస్తులు తమ కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పెరిగిన వేతనాన్ని అందుకుంటారు. ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థికంగా లాభం కలిగిన తర్వాత శివాలయంలోకానీ, ఆంజనేయస్వామి దేవాలయంలో కానీ ఉండే శనిదేవుడిని నువ్వులనూనెతో అభిషేకించండి.
మేష రాశి
కొద్ది సంవత్సరాలుగా పనులు కాకుండి నిలిచిపోయిన అన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. అందుకు శనిదేవుడి అండ ఉంటుంది. స్నేహితులను కలుసుకోవడంవల్ల లాభం కలుగుతుంది. మీ సంపద పెరిగి ఆస్తిని కొనుగోలు చేయడంతోపాటు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అదృష్టం అండగా ఉండటంవల్ల అన్ని పనులు సులువుగా పూర్తవుతాయి. కొత్త పని ప్రారంభించే సమయంలో, కొత్త వ్యాపారం చేసే సమయంలో ఈ రాశివారు శివాలయంలో ఒకసారి శనిదేవుడికి వారంతో సంబంధం లేకుండా నువ్వులనూనెతో అభిషేకం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.












Click it and Unblock the Notifications