శక్తివంతమైన సమసప్తక యోగంతో ఈ రాశులకు జరిగేది ఇదే!
గత నెల 28వ తేదీన నవ గ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి సంచారం చేశాడు. అయితే ఇలా సంచారం చేసే క్రమంలో శనిదేవుడికి 180 డిగ్రీల కోణంలో రావడంవల్ల సమసప్తక యోగం ఏర్పడింది. మీనరాశిలో శని, కన్యారాశిలో కుజుడు ఉండటంవల్ల ఈ యోగం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కొన్ని రాశులవారికి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు భారీ నష్టాలున్నాయి. కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కుంటారు.
ఈ మూడు రాశులకు చాలా కష్టం
ఎంతో శక్తివంతమైన సమసప్తక యోగం వల్ల కర్కాటక రాశి, మేషరాశి, మిథున రాశివారు అనేక ఇబ్బందులకు గురవుతారు. కెరీర్ పరంగా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తారు. అది భారీ నష్టాలను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా బ్యాంకు బ్యాలెన్స్ బాగా తగ్గిపోతుంది. డబ్బులకు ఇబ్బంది పడతారు. అవసరానికి సరిపడా డబ్బులు దొరకడం కూడా కష్టంగా మారుతుంది. ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు చేయడం చాలా మంచిది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నవారు ఆ ఆలోచన విరమించుకోవాలి. నష్టాల పాలయ్యే అవకాశం ఉంది.

నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి
ఈ మూడు రాశులవారు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు రేకెత్తుతాయి. చివరికి అవి తీవ్ర విభేదాలకు, ఆ తర్వాత విడాకులకు దారితీసే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తున్నారు. కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. మానసికంగా కూడా శాంతి ఉండదు. అనేకరకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కెరీర్ పై ఈ ప్రభావం పడుతుంది. పెట్టుబడుల రూపంలో డబ్బులు పెట్టేవారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే ఉత్తమం. వృత్తి జీవితంలో కూడా తీవ్రంగా నష్టపోతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే కొంతవరకు శాంతి కలుగుతుంది.












Click it and Unblock the Notifications