సింహరాశిలోకి చంద్రుడు.. 12 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశిచక్ర గుర్తులకు మంచి, మరికొన్ని రాశిచక్ర గుర్తులకు చెడు ఫలితాలు ఎదురవుతుంటాయి. పండు వెన్నెలను, చల్లటి వెన్నెలను ఇచ్చి ఆస్వాదించమనే చంద్రుడు వచ్చే నెల 12వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది చాలా అరుదుగా జరిగే పరిణామం. సింహరాశి సూర్యుడి సొంత రాశి. దీనివల్ల కొన్ని రాశులకు సమాజంలో మంచి గౌరవం లభించడంతోపాటు ఆర్థిక లాభాలు కలగనున్నాయి. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

సింహరాశి
ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. దీంతోపాటు వారి వేతనం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్థులకు వారు గతంలో ఏమైనా పెట్టుబడులు పెట్టివుంటే ఇప్పుడు మంచి ఫలితాలను పొందుతారు. ఊహించనిరీతిలో వాటినుంచి రాబడిని అందుకుంటారు. దీనివల్ల ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మనశ్శాంతిగా ఉండటంవల్ల ఆధ్యాత్మిక వాతావరణంవైపు ఆసక్తి చూపిస్తారు.

three zodiac signs will get good respect in society and huge money due to moon will enter leo

వృశ్చిక రాశి
హోలీ పండగ తర్వాత నుంచి ఈ రాశివారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలను ఆర్జించడంతోపాటు కొత్త వ్యాపారాలపై పెట్టుబడులు పెడతారు. అయితే పెద్దల సలహా, సూచన మేరకు ఈ పెట్టుబడులు ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే పెళ్లికానివారు ఈ సమయంలో శుభవార్తలను అందుకుంటారు. వివాహితులకు ఈ సమయం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా లాభాలున్నాయి.

మిథున రాశి
ఈ రాశివారి జీవితంలో అన్నీ సానుకూల మార్పులే చోటుచేసుకుంటాయి. జీవితంలో ఎదురవుతున్న అన్ని అడ్డంకులను ఈ సమయంలోనే అధిగమించగలుగుతారు. కొంతకాలంగా ఉన్న ఆస్తి వివాదాలు, ఇతర వివాదాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగస్థులకు వారి హోదాను బట్టి సమాజంలో గౌరవం కలుగుతుంది. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని దంపతులిద్దరూ చవిచూస్తారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+