ఈ నెల 7 నుంచే ఈ రాశులకు అదృష్టం పట్టుకుంది... డబ్బుకు తిరుగులేదు
జ్యోతిష్యం ప్రకారం బుధుడిని గ్రహాలకు యువరాజుగా పరిగణిస్తారు. తెలివితేటలు, వాక్చాతుర్యం, లెక్కలు, కమ్యూనికేషన్ స్కిల్స్, స్నేహానికి కారకుడు బుధుడు. ఈనెల 7వ తేదీన మేషరాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల మూడు రాశులవారికి అదృష్టం కలిసివచ్చింది. మీన రాశి నుంచి మేషరాశిలోకి బుధుడు రావడంవల్ల, సంచారం చేయడంవల్ల మేషరాశి, మిథునరాశి, సింహరాశులకు బాగా కలిసివస్తోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వారికి ఏవిధంగా కలిసివస్తోంది, వారికి ఆర్థిక లాభాలు ఎలా కలుగుతున్నాయి? అందులో మీ రాశి ఉందా? లేదా? అనే విషయాలను తెలుసుకుందాం.
సింహ రాశి
భౌతిక జీవితంలో సుఖాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక జీవితంవైపు మొగ్గు చూపించాలి. ఆ సుఖాలకు అలవాటుపడకుండా ఉండగలగాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఆదాయం వస్తుంది. మీ ఆలోచనాతీరుకు ప్రజల నుంచి మంచి పేరు వస్తుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి మంచి లాభాలున్నాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఈ రాశివారు ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అందరిచూపు వీరివైపే ఉంటుంది.

మేష రాశి
కొంతకాలంగా పనుల్లో ఆటంకాలు కలుగుతున్నాయి. అవన్నీ తొలగిపోతాయి. విద్యారంగానికి సంబంధించినవాటిల్లో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. అనుకోకుండా ధనం వస్తుంది. అలాగే ఆర్థికంగా మంచి లాభాలు కూడా కలుగుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. డబ్బును పొదుపు చేయకపోతే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది.
మిథున రాశి
ఈ రాశివారికి సంపద పెరుగుతుంది. జీవితంలో అడుగుపెట్టిన ప్రతి రంగంలోను విజయం సాధిస్తారు. కొంతకాలంగా అవకుండా నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. సంపద పెరగడంతోపాటు ఆదాయం పెరుగుతుంది. డబ్బు సంపాదనకు అదనపు మార్గాలు దొరుకుతాయి. మంచి ప్యాకేజీలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. బుధుడిని పూజించాలి.












Click it and Unblock the Notifications