2025లో ఈ రాశుల నెత్తిపై పాలు పోస్తున్న శుక్రుడు
నవగ్రహాల్లో కీలకమైన శుక్రుడు సంపదకు, ఐశ్వర్యానికి, లగ్జరీ జీవితానికి కారకుడు. ఇది చాలా విలాసవంతమైన గ్రహం. శుక్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాలను కలిగించడంతోపాటు మంచి ఫలితాలను రాశిచక్ర గుర్తులకు ప్రసాదిస్తుంటాడు. 2025వ సంవత్సరంలో అతి పెద్ద యోగాన్ని శుక్రుడు కల్పించబోతున్నాడు. మీనరాశిలోకి సంచారం చేయడంద్వారా రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. దీనివల్ల ఏయే రాశులవారు ఏవిధంగా లాభపడతారో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి వేతనం పెరగడంతోపాటు కొత్త బాధ్యతలను చేపడతారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తీసుకువస్తాయి. అదృష్టం తోడుండటంవల్ల డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతిభ చాలా ఉంటుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టబడుల నుంచి మంచి లాభాలను ఈ సమయంలో అందుకుంటారు.

వృషభ రాశి
జనవరి నెల నుంచి ఈ రాశివారి తలరాత మారిపోతుంది. కొత్తగా పెట్టే పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. జీవితంలో కొన్ని ముఖ్యమైన పనులను ఈ సమయంలో తలపెడతారు. దాంపత్య జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. బంధువుల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఖర్చులను తగ్గించుకొని డబ్బును భారీగా పొదుపు చేసుకుంటారు.
తులా రాశి
సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో కొంతకాలం ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించుకుంటారు. బంధువులు మీకు అనుకూలంగా ఉండటంవల్ల మీరు ఆనందంగా ఉంటారు. మిత్రుల నుంచి సహకారం అందుతుంది. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి ఉంది. మంచి లాభాలను కళ్లచూస్తారు. కొత్తగా జీవితంలో వచ్చే ఫలితాలు మీ జీవిత పురోగతికి ఉపయోగపడతాయి. స్వయం ఉపాధితోపాటు కళల రంగంలో ఉన్నవారికి మంచి యోగం పడుతుంది. అవివాహితులకు ఈ సమయంలో వివాహమయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications