శ్రావణ మాసంలో అదృష్టవంతులవుతున్న రాశులు వీరే
శ్రావణ మాసం అంటేనే శుభాల మాసం అని పేరు. ఈ నెల 23వ తేదీన ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి కుజుడు సంచారం చేశాడు. ప్రస్తుతం సింహరాశిలో ఉన్న అంగారకుడు త్వరలోనే కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఈ నెల 28వ తేదీ వరకు ఉంటాడు. అయితే ప్రభావం మాత్రం వచ్చేనెల 13వ తేదీ వరకు ఉంటుంది. ఈ ప్రభావం వల్ల మూడు రాశులవారు జాక్ పాట్ కొట్టబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
అదనపు ఆదాయ వనరులు దొరుకుతాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. వీరికి తోబుట్టువుల నుంచి విశేషమైన లాభాలుంటాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. దీంతోపాటు సంపాదన కూడా పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా గతంలోకంటే బలోపేతమవుతారు.

తులారాశి
ఉద్యోగాలు చేసేవారికి బాగా కలిసిరానుంది. వేతనాలు పెరిగి ఆర్థికంగా బలోపేతమవుతారు. పదోన్నతులున్నాయి. కోరుకున్నచోటకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ వెంటనే పూర్తవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడి కోసం పెట్టుబడులు పెడతారు.
సింహరాశి
వాహనాన్ని కొనుగోలు చేయడంతోపాటు ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఏ పని తలపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. వ్యక్తిగత జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంటారు.












Click it and Unblock the Notifications