today horoscope: చంద్రుని ఎఫెక్ట్.. ఈ రాశులవారు ఎమోషనల్, వీరికి పైసల ఫెస్టివల్!
29 నవంబర్ 2025 ద్వాదశ రాశులవారి జాతకాలు ఏ విధంగా ఉంటాయి. నవంబర్ 29వ తేదీ కుంభ రాశి నుండి మీన రాశికి చంద్రుని సంచారం జరుగుతుంది. తులా రాశిలో బుధ సంచారం కొనసాగుతుంది. వృశ్చిక రాశిలో సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడు భావోద్వేగ తీవ్రతలను పెంచుతారు. గ్రహాల సంచారంలో మార్పుల కారణంగా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ రాశులవారు ప్రతికూల ఫలితాలను చూస్తారో తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారి జీవితం నేడు భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసుల్లో పనిచేసే చోట సమిష్టిగా పని చేస్తే మంచి జరుగుతుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారు ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడానికి, గృహ సంబంధిత ఖర్చులను చేయడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో వీరు ప్రేమపూర్వకమైన జీవితాన్ని గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
మిధున రాశి
మిధున రాశి జాతకులు ఓపికతో ఆర్థిక లక్ష్యాలను సాధిస్తారు. వీరి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంతో కొత్త ఆవిష్కరణలను నేడు చేసే అవకాశం కనిపిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు నేడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. సమస్యల పరిష్కారం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చంద్రుడి ప్రభావంతో భావోద్వేగంతో కూడుకొని ఉంటారు.
సింహరాశి
సింహరాశి జాతకులు ఈరోజు ఏదైనా పని చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్య స్థితి బానే ఉంటుంది.
కన్యారాశి
కన్యారాశి జాతకులు ఆలోచనాత్మకంగా ఆర్థిక నిర్ణయాలను తీసుకోవలసిన అవసరం ఉంది. నేడు ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళతారు. ప్రశాంతత ప్రేమ వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
తుల రాశి
తులా రాశి వారు నేడు భావోద్వేగ సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక విషయాలలో ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సంబంధిత ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది. ప్రశాంతమైన జీవనశైలితో ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు కుటుంబ బాధ్యతలను నేడు జాగ్రత్తగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్త. ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడుకొని నేడు ఆరోగ్యంగా ఉంటారు.
ధనుస్సు రాశి
ఆర్థిక, స్వల్పకాలిక వ్యవహారాలలో ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. నేడు ధనుస్సు రాశి వారికి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వ్యూహాత్మక చర్చలు, సృజనాత్మక నిర్ణయాలు మేలు చేస్తాయి.
మకర రాశి
మకర రాశి వారు ఖర్చుల విషయంలో నేడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ప్రణాళికలను తిరిగి అంచనా వేసుకోవాలి. వీరికి ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశి వారు అదనపు జాగ్రత్తతో ఆర్థిక లక్ష్యాలను దీర్ఘకాలిక వ్యూహాలను చేరుకోవాలి. నేడు ఆత్మవిశ్వాసంతో కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.
మీనరాశి
మీనరాశి జాతకులు నేడు ఆధ్యాత్మిక అంతర దృష్టిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం వల్ల మీన రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications