Today horoscope: నేడు హనుమంతుడి అనుగ్రహంతో ఈ రాశుల వారికి అదృష్టం!!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. అయితే మంగళవారం హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో వారిపైన హనుమాన్ దయ తప్పకుండా ఉంటుంది. హనుమాన్ జీవితంలో కష్టాలను తొలగించే ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. హనుమాన్ ను పూజించటం వల్ల జాతకంలో అంగారకుడి బలం పెరుగుతుంది.
ఇక ఈరోజు కొన్ని రాశి చక్రాల వారి అదృష్టం మెరుస్తుంది. హనుమంతుని దయతో ఈరోజు మూడు రాశుల వారు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటి? వారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.జులై 18వ తేదీన అంటే నేడు హనుమంతుడి దయవల్ల మేష రాశి, మిధునరాశి, ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది.

ఈరోజు మేషరాశి వారికి కెరీర్ లో కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు లాభ స్థాయిలు పెరుగుతాయి. జీవితంలో వారు వేగంగా పురోగతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మేషరాశి జాతకుల కుటుంబంలో శాంతి ఉంటుంది. ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంటుంది. కుటుంబంతో సమయాన్ని గడపడానికి ఈ రోజు కేటాయించే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
హనుమాన్ దయవల్ల ధనుస్సు రాశి జాతకులకు కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వారికి మెరుగైన మంచి అవకాశాలు కలుగుతాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా ఫలవంతంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సన్నాహాలు చేసుకునే వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలోని సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో మెరుగైన లాభాలు పొందడానికి ఇది మంచి రోజు.
హనుమంతుడి దయ వల్ల నేడు మిధున రాశి జాతకులకు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో కీర్తి లభిస్తుంది. ఈరోజు వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అసంపూర్తిగా ఉన్న కార్యకలాపాలను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి మిధున రాశి జాతకులు ఈరోజు పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటే మంచిదని సలహా ఇవ్వబడింది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications