today horoscope: నేడు వీరికి ఆకస్మిక ధనలాభం ఖాయం చేసిన ముఖ్య గ్రహాలు!
జ్యోతిష శాస్త్రంలో ప్రతిరోజు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలు ప్రభావితమవుతాయి. ఈరోజు డిసెంబర్ 14 2025 ఆదివారం. ఇక ఆదివారం నాడు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులు ప్రతికూల ఫలితాలను చూస్తారు? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశి వారు నేడు ఆర్థికంగా మెరుగైన రోజును చూస్తారు. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారు నేడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరమైన ఖర్చులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపైనా శ్రద్ధ అవసరం.
మిధున రాశి
మిధున రాశి వారు వృత్తి వ్యాపారాలలో పురోగతిని చూస్తారు. కొత్త పరిచయాలు లాభాలను ఇస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మనసు కలత చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఓర్పుతో వ్యవహరించాలి. అప్పుడే సమస్యలను తేలికగా పరిష్కరించుకోగలుగుతారు.
సింహరాశి
సింహ రాశి వారికి నేడు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అధికారులతో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఇది సింహ రాశి వారికి కలిసి వచ్చే కాలం
కన్య రాశి
కన్య రాశి వారికి నేడు విద్యార్థులకు అనుకూలం అయిన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది
తులారాశి
తులా రాశి వారు నేడు భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం తులా రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి నేను పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభకార్య సూచనలు ఈరోజు కనిపిస్తున్నాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు నేడు దైవబలం కలిసి వస్తుంది. ప్రయాణాలు లాభాలను ఇస్తాయి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి నేడు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. కార్య భారం పెరిగినప్పటికీ అనుకున్న పనులు సాధిస్తారు. పెద్దల సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
కుంభరాశి
కుంభ రాశి వారికి మిత్రులు సహకార లభిస్తుంది. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీనరాశి
మీన రాశి వారికి ఖర్చుల పైన నియంత్రణ అవసరం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీన రాశి వారు శాంతంగా వ్యవహరించాలి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications