Today horoscope: నేడు వీరు సంపదల ప్రకాశంతో వెలిగిపోతారన్న శనిదేవుడు!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, వివిధ రాశులలో వాటి స్థితి అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేడు జనవరి 20 మంగళవారం. నేడు శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. నేడు కూడా బుదాదిత్య రాజయోగం ప్రభావం అన్ని రాశుల వారిపైన ఉంటుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషం:
మేషరాశి వారికి గ్రహయోగాల ప్రభావంతో పనుల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది.

Today horoscope with saturn blessings these zodiacs will get huge wealth and health

వృషభం:
వృషభ రాశి జాతకులకు వృత్తి రంగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

మిథునం:
నేడు మిధున రాశి జాతకులకు బుధ గ్రహ ప్రభావంతో కమ్యూనికేషన్ బలపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి .

కర్కాటకం:
కర్కాటక రాశి జాతకులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

సింహం:
సూర్య గ్రహ ప్రభావంతో నేడు సింహరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అధికారులతో అనుకూలత ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.

కన్య:
కన్యా రాశి వారికి నేడు పనుల్లో ఆలస్యం కలగవచ్చు. ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్యంపై దృష్టి అవసరం.

తుల:
తులా రాశి జాతకులకు శుక్ర గ్రహ అనుగ్రహంతో సంబంధాలు బలపడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాభ సూచనలు ఉన్నాయి.

వృశ్చికం:
వృశ్చిక రాశి జాతకులకు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కీలక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సహకారం ఉంటుంది.

ధనుస్సు:
గురు గ్రహ ప్రభావంతో ధనుస్సు రాశి వారు నేడు శుభవార్తలు అందుతాయి. విద్య, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణ యోగం ఉంది.

మకరం:
మకర రాశి జాతకులకు వృత్తి రంగంలో స్థిరత్వం ఉంటుంది. పెట్టుబడుల్లో ఆలోచించి ముందుకు వెళ్లాలి.

కుంభం:
నేడు కుంభరాశి వారి కొత్త ఆలోచనలు అమలులోకి వస్తాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది. లాభ అవకాశాలు ఉన్నాయి .

మీనం:
నేడు మీన రాశి వారికి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్య సూచనలు ఉన్నాయి.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+