Today Horoscope: బుధాదిత్య యోగంతో నేడు వీరు మట్టి పట్టుకున్నా బంగారమే!

నేడు ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు మేష రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు మకర రాశిలో ఉండటంతో బుధ ఆదిత్య యోగ ప్రభావం కనిపిస్తోంది. చంద్రుడు-కుజుడు కలిసి ఏర్పరిచే యోగం వల్ల ధైర్యం, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఈ గ్రహయోగాల ప్రభావంతో కొన్ని రాశులకు శుభఫలితాలు, మరికొన్నింటికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.

మేషరాశి
మేష రాశివారికి ఈ రోజు ఉత్సాహం అధికంగా ఉంటుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. నేడు మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. కొత్త ప్రయత్నాలకు అనుకూల సమయం.

Today Horoscope With the Budhaditya Yoga these zodiacs will get good fortune

వృషభ రాశి
వృషభ రాశివారికి ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే మంచిది. నేడు కాస్త ఓర్పుతో వ్యవహరించాలి.

మిథునరాశి
మిథున రాశివారికి గురు అనుకూలంగా ఉండటంతో అదృష్టం కలిసి వస్తుంది. నేడు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. నేడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు.

కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి కుటుంబ సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాల ద్వారా లాభం కలగవచ్చు.

సింహరాశి
సింహ రాశివారికి సూర్య అనుగ్రహం ఉంటుంది. నేడు సింహరాశి వారికి అధికారుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కన్యా రాశి
కన్య రాశివారికి బుద్ధిబలం పెరుగుతుంది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. నేడు కన్యా రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.

తులా రాశి
తుల రాశి వారికి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. శుక్ర గ్రహ అనుగ్రహం ఉంటుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజుడి ప్రభావంతో ధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నేడు ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు.

మకర రాశి
మకర రాశి వారికి సూర్యుడు, బుధుడు అనుకూలంగా ఉండటంతో ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. నేడు వీరికి ఆదాయం పెరుగుతుంది. అధికారిక పనులు సాఫీగా సాగుతాయి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి స్నేహితుల సహకారం లభిస్తుంది. కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నేడు కుంభరాశి వారికి ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది.

మీన రాశి
మీన రాశివారికి శని ప్రభావంతో బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. నేడు మీనరాశి వారికి ఓర్పు అవసరం.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+