దసరా నేడు.. ఈ దానాలు చేస్తే మీకు సంపదల వర్షం!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయం తెలిసిందే. అయితే పండుగలు కూడా మన జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తాయని, పండుగల సమయంలో చేసే పనులు కూడా అందరి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈరోజు విజయదశమి. విజయదశమి పండుగకు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజించి చెడుపై మంచి గెలిచిందని దానికి ప్రతీకగా పండుగ జరుపుకుంటాము.

దసరాకు ఈ దానాలతో లక్ష్మీ కటాక్షం
విజయదశమి పండుగ రోజు చేయాల్సిన కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మరి ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం.విజయదశమి పండుగ నాడు దానధర్మాలు చేయడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. దసరా పండుగ నాడు తెల్లటి వస్త్రాలను దానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. తెలుపు వస్త్రాలు శాంతికి ప్రతీక. అటువంటి తెలుపు వస్త్రాలను దానం చేయటం వలన జీవితంలో శాంతి, సామరస్యం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

Today is Dussehra If you make these donations you will be showered with wealth

ఇవి దానం చేస్తే విశేష ఫలితాలు
దసరా నవరాత్రులలో దుర్గా దేవిని పూజించి విజయదశమి పండుగ నాడు పసుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. పసుపు రంగు వస్త్రాలతో పాటు స్వీట్లను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. పసుపు అదృష్టానికి సూచికగా భావించబడుతుంది. ఇలా పసుపు రంగు వాటిని దానం చేస్తే వ్యాపారంలో ఉండే ఇబ్బందులు తొలగిపోయి, వృత్తిలో పురోగతి కనిపిస్తుంది.

ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇవి దానం చెయ్యండి
విజయదశమి పండుగ నాడు ఏదైనా ఆలయానికి కానీ, ఎవరైనా వ్యక్తికి కానీ చీపురును దానం చేయడం ఎంతో మంచిది. దీనివల్ల వాస్తు దోషాలు తొలగిపోయి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. విజయదశమి పండుగ నాడు గాజులు దానం చేస్తే మంచిది.

దసరాకు ఇలాంటి దానాలతో సంపదల వర్షం
చాలామంది దసరా నవరాత్రులలో తొమ్మిది రోజులు పసుపు, కుంకుమ, గాజులు, గోరింటాకు, తిలకం వంటి శుభకరమైన, మంగళకరమైన వస్తువులను దానం చేస్తారు. వీటిని దానం చేయడం ఎంతో శుభప్రదంగా అనిపిస్తుంది. వీటితో సంతోషం, శ్రేయస్సు కలుగుతుంది. దసరాకు ఇలాంటి దానాలతో సంపదల వర్షం కురుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+