నేడే 5అద్భుత యోగాలతో కూడిన పుష్యపౌర్ణమి; శుభముహూర్తం, పూజావిధానం తెలుసుకోండి!!
జ్యోతిష్య శాస్త్రంలో పుష్య పౌర్ణమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. పుష్య పౌర్ణమిన రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. నేడు పుష్య పౌర్ణమి సందర్భంగా అరుదైన అద్భుతమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. 2024 సంవత్సరంలో పుష్య మాసం లోని శుక్లపక్ష పౌర్ణమి రోజును పుష్య పౌర్ణమి గా చెబుతారు.
పౌర్ణమి తిధి జనవరి 24 బుధవారం రోజు రాత్రి 9:49 నిమిషాలకు ప్రారంభమై జనవరి 25 గురువారం నాడు రాత్రి 11 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. సాధారణంగా. ఉదయం ఉన్న తిథి ప్రకారం పరిగణనలోకి తీసుకోవడంతో సంవత్సరంలోని మొదటి పూర్ణిమ జనవరి 25వ తేదీన నిర్వహిస్తున్నారు.

పుష్య పౌర్ణమి రోజు ఉపవాసం మరియు దానాలు, స్నానాలు చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ సంవత్సరం పుష్య పౌర్ణమి నాడు సర్వార్ధ సిద్ధి యోగం, ప్రీతి యోగం, గురు పుష్య యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం కలయిక జరుగుతుంది. అంతేకాదు త్రిగ్రాహి యోగంతో పౌర్ణమి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఇక పుష్య పౌర్ణమి నాడు పూజా విధానాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీ నారాయణుని ప్రతి ఒక్కరు పూర్ణ క్రతువుల తో పూజించాలి. ఈరోజు విష్ణుమూర్తికి పసుపు రంగు పళ్ళు, పువ్వులు, వస్త్రాలు సమర్పించాలి. లక్ష్మీ దేవికి గులాబీ లేదా ఎరుపు రంగు పువ్వులు, అలంకరణ వస్తువులను సమర్పించాలి. పుష్య పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామిని పూజించి, సత్యనారాయణ స్వామి వ్రత కథలను చదివితే పుణ్యం వస్తుంది.
పుష్య పౌర్ణమి నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అలా నదీ స్నానం చేయకపోతే కనీసం స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేసినా ఫలితం ఉంటుంది. పుష్య పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం, లక్ష్మీనారాయణుని పూజించడం ద్వారా ఇంట్లో సంతోషం మరియు సంపద, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి.
ఇక పుష్య పౌర్ణమి నాడు శుభముహూర్తం విషయానికి వస్తే బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం11.57 నిమిషాల నుండి 12.40 నిమిషాల వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 .07 నిమిషాల నుండి 2.50 నిమిషాల వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 3.29 నిమిషాల నుండి 5.14 నిమిషాల వరకు ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications