Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Today Rasi Phalalu : రాహువు, కేతువుల అద్భుతం..ఈ రాశుల వారు మట్టి పట్టుకున్న బంగారమే..!

మేషం (Aries) : ఈ రోజు ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం లేదా రావాల్సిన పాత బకాయిలు చేతికి అందుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్య పనులలో విజయం సాధిస్తారు.

వృషభం (Taurus) : మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి. విదేశీ యాన ప్రయత్నాలు నెరవేరుతాయి. వ్యాపారాలలో అనుకూల ఫలితాలు, ఆకస్మిక ధనలాభం ఉంటుంది.అన్ని విషయాల్లోనూ విజయం సాధించే అవకాశం ఉంది. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Today Rashi Phalalu Jyotishyam Zodiac Predictions in Telugu for friday November 7th 2025

మిథునం (Gemini) : రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ ఈ రోజు ప్రయాణాలు ఎక్కువై, శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి. ఖర్చులు అధికం కాకుండా చూసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు వద్దు.

కర్కాటకం (Cancer) : ఈ రోజు మీరు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుంటారు. పని పట్ల నిబద్ధత పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి మాట్లాడాలి. కాలాన్ని వృథా చేయకుండా పనిపై దృష్టి పెట్టండి.

సింహం (Leo) : మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి గోచరిస్తుంది. ఒక శుభవార్త మీకు మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది.

కన్య (Virgo) : వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. తోటి ఉద్యోగులు లేదా మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని చిన్న సంఘటనలు బాధ కలిగించినా, మొత్తం మీద రోజు అనుకూలంగా ఉంటుంది.

తుల (Libra) : ఈ రోజు పట్టు వదలకుండా పనిచేస్తే మీరు అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు. అధైర్య పడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ తెలివితేటలు మీకు లాభాన్నిస్తాయి.

వృశ్చికం (Scorpio) : అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. సంతృప్తికర ఫలితాల కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ధనుస్సు (Sagittarius): ప్రారంభించిన పనులలో మంచి పురోగతి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యజయం లభిస్తుంది. మీ మానసిక సంతోషం అధికమవుతుంది. బంధువులతో మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి సంయమనం పాటించడం మంచిది.

మకరం (Capricorn): మీరు పడే శ్రమకు తగ్గ ఫలితాలు లభిస్తాయి. అయితే, మీరంటే గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం.

కుంభం (Aquarius): మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకు వెళ్లండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

మీనం (Pisces) : ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు కలగకుండా చూసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రశాంతమైన ఆలోచనలతో రోజు గడుస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+