Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. వీరికి ఆరోగ్యనష్టం!
2025 నవంబర్ 25వ తేదీ మంగళవారం నాడు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి. ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూడాల్సి వస్తుంది? అనే వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఈ సమయంలో సమస్యలు పరిష్కారమవుతాయి. నేడు శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. స్నేహితులు బంధుమిత్రుల సహకారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభసాటిగా ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉండదు. వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. నేడు వృషభ రాశి వారికి ఓర్పు అవసరం.
మిధున రాశి
నేడు మిధున రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. అనుకోని సమస్యలు వచ్చి పడతాయి. కష్టానికి తగిన ఫలితం అతి కష్టం మీద లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. కొత్త పరిచయాలు, అధికారుల అండ లభిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది.
సింహరాశి
సింహరాశి జాతకులు ఈరోజు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కోసం విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇతరుల పట్ల తమ వైఖరిని సింహ రాశి వారు మార్చుకోవాలి. ఈరోజు అంతా సానుకూల ఫలితాలు ఉండవు.
కన్యారాశి
కన్యా రాశి వారికి ఈ రోజు పెండింగ్ పనులు ముందుకు సాగుతాయి. ఇతరులకు సహాయం చేయాలని ఆలోచన ఉన్నవారు ఈరోజు అనుకున్న పనులు చేస్తారు.
తులారాశి
ఈరోజు తులారాశి జాతకులు నిరాశ చెందకూడదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. నేడు ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు నేడు ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. సానుకూల ఫలితాలను ఈ రోజు చూస్తారు. సంతోషంగా జీవిస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకుల ఆరోగ్యం బాగుంటుంది. ఇతరులను ఆకట్టుకోవడానికి ధనస్సు రాశి జాతకులు అధికంగా ఖర్చు చేయకుండా ఉంటే మంచిది. ఏకాగ్రతతో ధనుస్సు రాశి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.
మకర రాశి
మకర రాశి వారికి నేడు కీలక బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. స్పష్టమైన మనసుతో నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. నేడు మకర రాశి వారికి కాస్త సానుకూలంగానే ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశి జాతకులు పిల్లలతో ఆడుకోవడాన్ని ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగం చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు ఉంటాయి.
మీనరాశి
మీనరాశి జాతకులు నేడు చేసే పని శ్రమతో కూడుకుని ఉంటుంది. అయినప్పటికీ ఫలితం సానుకూలంగా ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే అంతా కలిసి వస్తుంది. నేడు వినోద, క్రీడ కార్యాకలాపాలు, బహిరంగ కార్యక్రమాలలో పాల్గొంటారు.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications