Today Rashiphalalu: ఈ రాశులవారికి జాక్‌పాట్.. సూర్య శుక్రుల స్థితి కారణంగా..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 9న గ్రహాల సంచారాల వల్ల కొన్ని రాశుల వారికి శుభఫలితాలు వస్తాయి. ముఖ్యంగా చంద్రుని సంచారం, సూర్యుడు-శుక్రుడి స్థితి కారణంగా ఆర్థికంగా, ఉద్యోగాల్లో, కుటుంబ జీవితంలో మార్పులు కనిపిస్తాయి. ఇక నేడు మరికొన్ని రాశులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్య గ్రహాల సంచారంతో కలిగే ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషం

మేషరాశి జాతకులకు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. పనుల్లో ఆలస్యం ఉన్నా చివరకు ఫలితం దక్కుతుంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.

today rashiphalalu financial benefits to these zodiac signs on feb 9th due to sun and venus conjunction

వృషభం

వృషభ రాశి జాతకులకు నేడు ఖర్చులు పెరుగుతాయి. ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

మిథునం

మిధునరాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. స్నేహితుల సహకారం ఉంటుంది.

కర్కాటకం

కర్కాటక రాశి జాతకులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పాత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

సింహం

నేడు సింహరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది.

కన్య

కన్యా రాశి జాతకులు నేడు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ మార్పు ఆలోచనలో ఉన్నవారు కొంత సమయం వేచి చూడటం చాలా మంచిది.

తుల

తులారాశిలో ఉన్న విద్యార్థులకు ఇది శుభకాలం.నేడు వీరికి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ సంబంధాల్లో స్పష్టత అవసరం.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి నేడు ఆర్థిక లాభాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధనుస్సు

నేడు ధనుస్సు రాశి జాతకులకు పనిభారం పెరుగుతుంది. సహనం అవసరం. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. అందుకే జాగ్రత్త.

మకరం

నేడు మకర రాశి వారికి కలిసి వస్తుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో లాభం ఉంటుంది. శుభకార్యాల యోచనలు జరుగుతాయి.

కుంభం

కుంభరాశి జాతకులకు నేడు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది.

మీనం

మీనరాశి జాతకులు నేడు ఖర్చులు నియంత్రించాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం మంచిది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+