today rashiphalalu: నేడు వీరు నక్కతోక తోక్కినట్టే అదృష్టం వస్తుంది.. మీరున్నారా?

ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం వివిధ గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు ప్రభావితం అవుతున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన సూర్యుడు, బుధుడు మకర రాశిలో, చంద్రుడు మిధున రాశిలో సంచరిస్తున్నారు. ఇక శుక్రుడు కుంభరాశి లోను, కుజుడు వృషభ రాశిలోనూ, బృహస్పతి మిధునరాశి లోనూ సంచారం చేస్తున్నారు.

ఫిబ్రవరి 3న ద్వాదశ రాశుల వారి జాతకాలు

శని మీనరాశి లోను, రాహువు కుంభరాశి లోను, కేతువు సింహ రాశి లోనూ సంచారం చేస్తూ కొన్ని రాశుల వారికి శుభాలను, మరికొన్ని రాశుల వారికి అశుభాలను ఇస్తున్నారు. ఇక ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం నాడు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

today rashiphalalu know 2026 horoscope with detailed planetary transits and daily zodiac prediction

మేషం

మేష రాశి వారికి పని ఒత్తిడి ఉన్నా ఫలితం దక్కుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.

వృషభం

వృషభ రాశి జాతకులకు ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.

మిథునం

మిధున రాశి జాతకుల ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నేడు వీరికి కొత్త పరిచయాలు లాభిస్తాయి.

కర్కాటకం

కర్కాటక రాశి జాతకులకు నేడు అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఈ సమయంలో నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

సింహం

సింహరాశి జాతకులు నేడు తీసుకునే సాహస నిర్ణయాలు ఫలిస్తాయి. అధికారులతో అనుకూలత ఉంటుంది.

కన్య

కన్యా రాశి వారికి పని విషయంలో జాప్యం ఉండొచ్చు. ఈరోజు కన్యా రాశి వారు సహనం పాటిస్తే మేలు జరుగుతుంది.

తుల

తులారాశి జాతకులు నేడు ఆర్థిక లాభాలు పొందుతారు. తులా రాశి వారికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

వృశ్చికం

నేడు వృశ్చిక రాశి వారి మనసు అశాంతిగా ఉంటుంది. కీలక నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది.

ధనుస్సు

ధనుస్సు రాశి జాతకుల ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. శుభవార్తలు అందుతాయి.

మకరం

నేడు మకర రాశి జాతకులకు బాధ్యతలు పెరుగుతాయి. పేరు ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి.

కుంభం

కుంభ రాశి వారికి నేడు కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్నేహితుల సహకారం లభిస్తుంది.

మీనం

మీనరాశి జాతకులకు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సహకారం ఉంటుంది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+