today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు!
మార్చి 29 2026, ఈ రోజు జ్యోతిష్య పరంగా ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఆధ్యాత్మికత కలుగుతుంది. పాత కర్మల ప్రభావంతో జీవితంలో మార్పులు కనిపించవచ్చు. ఇక నేడు చంద్రుని గమనం భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది.
కేతువు మఖ నక్షత్ర ప్రవేశం వల్ల కొన్ని రాశులకు లబ్ది
ఇతర గ్రహాల స్థితి కలిసి కొన్ని రాశులకు శుభప్రదంగా మరికొన్ని రాశులకు జాగ్రత్త అవసరాన్ని సూచిస్తుంది. ఈ రోజు కేతువు మఖ నక్షత్ర ప్రవేశం వల్ల ముఖ్యంగా సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి శుభఫలితాలు కనిపిస్తాయి. పాత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.

మేషం
ఈ రోజు మేషరాశి జాతకులకు ఆర్థికంగా లాభాలు కలగవచ్చు ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. నేడు వీరికి కుటుంబంలో సంతోషం ఉంటుంది
వృషభం
వృషభ రాశి జాతకులకు కొన్ని పనుల్లో ఆలస్యం ఉండొచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇప్పుడు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
మిథునం
మిధున రాశి జాతకులకు నేడు స్నేహితుల సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు, కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. అన్ని విధాలా బాగుంటుంది.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులకు ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. కుటుంబ విషయాల్లో కర్కాటక రాశి వారు శాంతంగా వ్యవహరించాలి.
సింహం
సింహరాశి జాతకులకు నేడు కేతువు ప్రభావంతో ఆధ్యాత్మికత పెరుగుతుంది. విదేశీ అవకాశాలు కలగవచ్చు.
కన్య
కన్యా రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు నేడు తగ్గించాలి.
తుల
తులారాశి జాతకులకు భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం వస్తుంది. నేడు వీరికి సంబంధాలు బలపడతాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి జాతకులకు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.నేడు వీరు ధైర్యంగా ముందుకు సాగుతారు
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులకు విద్యార్థులకు మంచి సమయం. ప్రయాణాలు లాభిస్తాయి.
మకరం
మకర రాశి జాతకులకు నేడు కుటుంబంలో చిన్న సమస్యలు రావచ్చు. సహనం అవసరం.
కుంభం
కుంభ రాశి జాతకులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది
మీనం
మీనరాశి వారికి నేడు ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications