Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

today rashiphalalu: చంద్ర, కుజుల సంచారంతో వీరు ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొడతారు

17 ఫిబ్రవరి 2026న మంగళవారం గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ రోజు సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తూ కొన్ని రాశులవారికి మేలు చేస్తున్నాడు. బుధుడు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు సంబంధాలు మరియు ఆర్థిక వ్యవహారాల్లో శుభఫలితాలను అందించనున్నాడు.

నవగ్రహాల సంచార ప్రభావం

కుజుడి స్థితి ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండగా, చంద్రుని సంచారం రోజువారీ భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది. ఈ గ్రహస్థితుల ప్రభావం ప్రతి రాశిపై వేర్వేరు విధాలుగా కనిపించనుంది.కొన్ని రాశులకు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా లభ్ది జరుగుతుంటే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

today rashiphalalu The transit of Chandra and Mars will cause these zodiac signs very lucky and wealthy

మేష రాశి

మేషరాశి జాతకులకు నేడు ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో పురోగతి సూచనలు కనిపిస్తాయి. ఆర్థిక లాభాలు కలగవచ్చు. ఇది మేషరాశి వారికి సానుకూల ఫలితాలు ఇచ్చే కాలం.

వృషభ రాశి

వృషభ రాశి జాతకులు కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయం కాగా, ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

మిథున రాశి

మిధున రాశి వారికి నేడు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో స్నేహితులతో కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో చిన్న అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఇది వీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు.

సింహ రాశి

సింహరాశి వారికి నేడు ప్రతిష్ఠ, గౌరవం పెరుగుతుంది. అధికారులతో అనుకూలత ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది.

కన్య రాశి

కన్యా రాశి జాతకులకు నేడు సానుకూల ఫలితాలు వస్తాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో శుభసూచనలు కనిపిస్తాయి. ప్రయాణ యోగం కూడా ఉంటుంది.

తుల రాశి

తులారాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. నేడు నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా ఉంటేనే మంచిది.

వృశ్చిక రాశి

నేడు వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులకు కొత్త అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగ మార్పు లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది వీరికి మంచి సమయం.

మకర రాశి

మకర రాశి వారికి కుటుంబ సహకారం లభించి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. నేడు మకర రాశి జాతకులు అన్ని విధాలా లాభాలను చూస్తారు.

కుంభ రాశి

కుంభరాశి వారికి స్వీయ నిర్ణయాలు లాభిస్తాయి. కొత్త పరిచయాలు, సామాజిక గౌరవం పెరుగుతుంది. ఇది వీరికి మంచి రోజు.

మీన రాశి

మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరిగి, అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక మీనరాశి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్త.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+