today rashiphalalu: నేడు ఈ రాశులవారికి ఆరోగ్యం, సంపద, అదృష్టం కూడా..ముఖ్యగ్రహాల మాట!
వేద జ్యోతిషశాస్త్రంలో ప్రతిరోజు జరిగే గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను నిర్ణయిస్తాయి. జనవరి 28వ తేదీన బుధవారం నాడు సూర్యుడు కుంభ రాశిలో ఉండగా,
చంద్రుడు కన్య రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు కుంభ రాశిలోనే సంచరిస్తాడు. శుక్రుడు మకర రాశిలో ఉంటాడు.కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తుండగా, బృహస్పతి మిధున రాశి లోనే ఉంటున్నాడు.
12 రాశులలో గ్రహ సంచారాలు, జ్యోతిష్య ఫలాలు
ఇక శని మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ రోజు కుంభ రాశిలో సూర్యుడు, బుధుడు, రాహు ప్రభావం ఉండటం వల్ల సామాజిక, రాజకీయ, ఉద్యోగ సంబంధ విషయాల్లో కీలక చర్చలు జరుగుతాయి. నేటి ద్వాదశ రాశుల వారి జ్యోతిష్య ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి
మేషరాశి జాతకులకు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
వృషభ రాశి
కుజుడి ప్రభావంతో వృషభ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించాలి.
మిథున రాశి
గురు అనుకూలంగా ఉండటంతో మిధున రాశి వారికి విద్య, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి
నేడు కర్కాటక రాశి జాతకులకు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి కేతు ప్రభావంతో నిర్ణయాల్లో అయోమయం ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.
కన్య రాశి
కన్య రాశి జాతకులకు చంద్రుడు మీ రాశిలో ఉండటంతో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పనుల్లో ఏకాగ్రత అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
తుల రాశి
నేడు తులారాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు ఉద్యోగ ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితం అనుకూలంగా ఉంటుంది. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు నేడు దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.
మకర రాశి
మకర రాశి వారు శుక్రుడి ప్రభావంతో ఆర్థిక లాభాలు పొందుతారు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి.
కుంభ రాశి
సూర్యుడు, రాహు ప్రభావంతో కుంభ రాశి వారి పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. అయితే మాటలపై, ప్రవర్తనపై నియంత్రణ అవసరం.
మీన రాశి
శని ప్రభావంతో మీనరాశి జాతకుల బాధ్యతలు పెరుగుతాయి. ఓర్పుతో పనిచేస్తే దీర్ఘకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఇది మీన రాశి వారికి అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications