today rashiphalalu: బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులవారి జాతకాలు మారుతున్నాయ్!

ఫిబ్రవరి 13, 2026న గ్రహ సంచారాల ప్రభావం ద్వాదశ రాశులపై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నేడు సూర్యుడు కుంభరాశి లోను, నేడు చంద్రుడు మిథున రాశిలో గోచరిస్తున్నాడు. కుంభరాశిలో సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల కొన్ని రాశులకు ఇది మంచి అవకాశాలను తీసుకురాగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 13 శుక్రవారం నాడు ద్వాదశ రాశులవారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి

ఫిబ్రవరి 13న మేషరాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు తొలగిపోయి అంతా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడిపే అవకాశం ఉంటుంది.

today rashiphalalu today budhaditya rajyoga gives some zodiacs huge money luck and happiness

వృషభ రాశి

వృషభ రాశి జాతకులు నేడు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలపై మనసు పెట్టకుండా ఉండాలి. సహనంగా వ్యవహరించడం మంచిది.

మిధున రాశి

మిథున రాశి వారికి నేడు చంద్ర ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూల సమయం.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం మంచిది.

సింహరాశి

సింహ రాశి వారికి నేడు బుధ సూర్యుల కలయిక కారణంగా మంచి జరుగుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో మంచి వార్తలు వినే అవకాశం ఉంది.

కన్యారాశి

కన్య రాశి వారికి నేడు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. పనిభారం పెరుగుతుంది. ఏ పని చేసినా కన్యా రాశి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

తులారాశి

తుల రాశి వారికి నేడు ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. రహస్య విషయాలు బయటపడకుండా జాగ్రత్త అవసరం. నేడు మాట్లాడేటప్పుడు మాటలో అదుపు అవసరం.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి నేడు భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఏ పని చేసిన కలిసి వస్తుంది.

మకర రాశి

మకర రాశి వారికి పనిలో మార్పులు రావచ్చు. ఓర్పుతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. నేడు మకర రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.

కుంభరాశి

కుంభ రాశి వారికి సూర్య గోచారం వల్ల నేడు ఆత్మబలం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు అనుకూలమైన రోజు. కాబట్టి నిరభ్యంతరంగా పనులను మొదలు పెట్టుకోవచ్చు.

మీన రాశి

మీన రాశి వారికి మనసు కొంత అశాంతిగా ఉండే అవకాశం ఉంది. ధ్యానం, ప్రార్థన మనశ్శాంతిని కలిగిస్తాయి. ఇది మీన రాశి వారికి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+