today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు
మార్చి 27 2026 గురువారం నాడు అన్నిరాశులవారి జీవితాలలో ముఖ్య గ్రహాల సంచారం అనేక మార్పులను తెస్తుంది. నేడు శ్రీరామనవమి వేళ గ్రహాల రాజు గురువు చంద్రుడితో సంయోగం చెందటం వల్ల గజకేసరి రాజయోగం, గురువు కుజుల ప్రభావంతో నవ పంచమ రాజయోగం ఏర్పడుతున్నాయి. ఈరోజు యోగాల ప్రభావం అన్ని రాశుల పైన పడుతుంది.
నేడు ముఖ్య గ్రహాల సంచారం
ఈ రోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తూ స్థిరత్వం, ఆర్థిక విషయాల్లో స్పష్టతను ఇస్తాడు. సూర్యుడు మీన రాశిలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల సంబంధాలలో సానుకూలత వస్తుంది.

మేష రాశి
మేష రాశి వారికి నేడు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్న విభేదాలు రావచ్చు. పనుల్లో ఒత్తిడి ఉన్నా పూర్తి చేస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు మీకు అనుకూలమైన రోజు. కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఆదాయం పెరుగుతుంది.
మిథున రాశి
మిధున రాశి వారికి నేడు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాల్లో తొందరపడకండి. ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మిత్రులతో కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి.
సింహ రాశి
సింహరాశి జాతకులు నేడు పనిలో ప్రశంసలు పొందుతారు. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. ప్రయాణాలు ఉండవచ్చు.
కన్య రాశి
కన్యారాశి జాతకులకు దూరప్రయాణాలు అనుకూలం. విద్యార్థులకు మంచి ఫలితాలు. ఆధ్యాత్మికత పెరుగుతుంది.
తుల రాశి
తులా రాశి జాతకులకు అనుకోని ఖర్చులు రావచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. నిర్ణయాల్లో స్పష్టత అవసరం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు దాంపత్య జీవితంలో సౌఖ్యం కలుగుతుంది. భాగస్వాములతో సమన్వయం ఉంటుంది. వ్యాపారంలో లాభం వస్తుంది.
ధనుస్సు రాశి
నేడు ధనుస్సు రాశి వారు పనిలో బిజీగా ఉంటారు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. సహచరులతో సహకారం ఉంటుంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు నేడు సృజనాత్మక పనుల్లో విజయం చేకూరుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలత. పిల్లల విషయాల్లో ఆనందం కలుగుతుంది.
కుంభ రాశి
కుంభరాశి జాతకులు నేడు ఇంటివిషయాల్లో శ్రద్ధ పెట్టాలి. కుటుంబంతో సమయం గడపడం మంచిది.
మీన రాశి
మీనరాశి జాతకులకు సంభాషణల ద్వారా లాభాలు వస్తాయి. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. చిన్న ప్రయాణాలు ఉండవచ్చు.అయితే అన్ని రాశుల వారు నేడు శాంతంగా నిర్ణయాలు తీసుకుంటే అన్ని రంగాల్లో మంచి ఫలితాలు పొందవచ్చు.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications