today rashi phalau: నేడు వీరికి ఆకస్మిక ధనలాభం, బ్రతుకు బంగారం!
ప్రతి ఒక్కరు ఈరోజు తమ జాతకం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం నవంబర్ 22వ తేదీ ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంది? ఎవరికి మంచి చేకూరుతుంది? ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు మేషరాశి వారికి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగాలలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ పెట్టాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది మంచి రోజు. వ్యక్తిగత నిర్ణయాలలో స్పష్టత వచ్చే రోజు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.
మిధున రాశి
మిధున రాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది. కమ్యూనికేషన్ బలంగా ఉంటుంది. మిధున రాశి జాతకులు ఈరోజు వాళ్ళ మాటలతోనే పనులు సాధించుకుంటారు. ఫైనాన్స్ లో లాభాలు వస్తాయి. స్నేహితులతో బంధం మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, పనులలో శ్రేయస్సు కనిపిస్తుంది. గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి నూతన మార్గాలు తెరుచుకుంటాయి. కొనుగోలు లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు పరిశీలించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.
సింహరాశి
సింహ రాశి వారికి రోజు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తప్పు దారికి తీసుకువెళతాయి. సింహరాశి జాతకులు కాస్త తగ్గినా, మళ్ళీ వేగంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ సమయంలో సింహ రాశి వారు శుభవార్తలు వింటారు.
కన్యారాశి
కన్యా రాశి వారికి ఉద్యోగంలో కొత్త మెరుగుదల ఉంటుంది. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ప్రొఫెషనల్ గా పనిచేసే వారికి పనుల్లో మీ ప్లానింగ్ ఉపయోగపడుతుంది. ఈరోజు కన్యా రాశి వారికి అవకాశాలు విస్తరిస్తాయి.
తులారాశి
తులా రాశి వారు కొన్ని విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు తులారాశి జాతకులు ఆర్థిక ప్రవాహం ఉంది కానీ ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. ఫ్యామిలీ సమస్యలు సర్దుబాటు అవుతాయి. ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇది చాలా మంచి రోజు. వృశ్చిక రాశి జాతకులు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు కరెక్ట్ గా పనిచేస్తాయి. పనులలో వేగం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, స్నేహితుల నుంచి మంచి వార్తలు వినే అవకాశం కలుగుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కొత్త మార్పులు సహకారాన్ని అందించే రోజు. ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వారు ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి వారికి ధన లాభాలు వస్తాయి. ఫిజికల్ ఎనర్జీ బాగుంటుంది. పనులు బాగా జరుగుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి ఈరోజు బిజీగా ఉంటుంది. ఫలప్రదంగా కూడా ఉంటుంది. ఆర్థిక విషయాలలో స్థిరత్వం కనిపిస్తుంది. కుటుంబం నుంచి ఈరోజు మకర రాశి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ పని చేసిన శుభప్రదంగా జరుగుతుంది.
కుంభరాశి
కుంభ రాశి వారికి చిన్న ఇబ్బందులు వచ్చిన అవి మీ లాజిక్ తో సులభంగా పరిష్కారం అవుతాయి. వీరికి ప్రయాణ యోగం ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
మీన రాశి
మీన రాశి వారికి నేడు శుభదినం. అనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి. ధన లాభం కలుగుతుంది. శుభకార్యాలు చేసే యోగం ఉంది. కొత్త అవకాశాలు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. ఇది మీన రాశి వారికి శుభ సమయం.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications