నేడు ఈ రాశులవారిదే అదృష్టం!!
గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలలో ప్రతిరోజు గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. నేడు కొన్ని రాశుల వారికి శుభాలు కలుగుతుండగా, కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మేషరాశి నుండి కన్యా రాశి వరకు ఉన్న రాశుల వారికి నేడు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి జాతకులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మేషరాశి జాతకులు ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ మీ రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగటంతో మంచి ఫలితాలు సొంతమవుతాయి. అయితే నేడు ఎవరిని అతిగా నమ్మకూడదని సూచించబడింది. శ్రీరామ నామ జపాన్ని చేయాలని సలహా ఇవ్వబడింది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వబడింది. వృషభరాశి జాతకులు నేడు ప్రారంభించిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి జాతకులు నేడు అనవసరమైన వ్యవహారాలలో తల దూర్చంకుండా ఉంటే మంచిది. వృషభ రాశి జాతకులకు చతుర్థ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. నేడు సమయానికి భోజనం చేసి నిద్ర పోవడం చేయాలి. నారాయణ మంత్రం జపించడం మంచిదని చెప్పబడింది.
మిధున రాశి
మిధున రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. మిధున రాశి జాతకులు ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను వెతకాలి. ఇక బంధుమిత్రులను వీరు కలుపుకొని పోయే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు నేడు వీరికి ఉంటాయి. కొన్ని సంఘటనలు నేడు వీరికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. నేడు శివారాధన చేయడం మంచిదని సలహా ఇవ్వబడింది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. వీరు తీసుకునే స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. నేడు బంధువుల సహకారం నిండుగా ఉంటుంది. ఈరోజు చేసే స్థిరాస్తి కొనుగోళ్ళు లాభదాయకంగా ఉంటాయి. భోజన సౌఖ్యం ఉంటుంది. ఇష్ట దైవారాధన చేయడం శుభప్రదంగా చెప్పబడింది.
సింహరాశి
సింహరాశి జాతకులకు నేడు బాగా కలిసి వస్తుంది. మీరు దైవ బలంతో అనుకున్నది సాధిస్తారు. వీరి కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి. అనూహ్యమైన ధన లాభాన్ని పొందుతారు. ఆర్ధికంగా నేడు వీరికి లాభదాయకంగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే వీరికి ఇంకా బాగుంటుందని సలహా .
కన్యారాశి
కన్యారాశి జాతకులకు నేడు అన్ని విషయాలలో బాగున్నప్పటికీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. కన్యారాశి జాతకులు నేడు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉంటాయి. నేడు వీరికి ఇష్ట కార్య సిద్ది ఉంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. గురు చరిత్ర పారాయణం చేయడం మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications