Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

today rasi phalalu: ఈ రాశులవారికి నేడు వస్తుయోగం!!

హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మానవ జీవనాన్ని నిర్ణయిస్తుంది. గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలపై ప్రభావం పడుతుంది. నేడు మేషరాశి నుండి కన్యా రాశి వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంది? నేడు ఎవరికి కలిసొస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అనేది తెలుసుకుందాం.

మేష రాశి
మేషరాశి జాతకులకు నేడు కలిసొస్తుంది. మేషరాశి జాతకులు నేడు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. పనిచేసే చోట అధికారుల సహకారం లభిస్తుంది. అయితే పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు వీరికి పుష్కలంగా ఉంటాయి. ఇష్ట దైవ ప్రార్థన చేయడం శుభప్రదం.

today rasi phalalu today lucky day for these zodiac signs

వృషభ రాశి
వృషభరాశి జాతకులు నేడు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. వృషభ రాశి జాతకులు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరు వ్యక్తుల ప్రవర్తన మీకు బాధను కలిగిస్తుంది. నేడు వీరు ఆదిత్య హృదయం పఠనం చేయడం ఉత్తమం.

మిధున రాశి
మిధున రాశి జాతకులు నేడు సంతోషంగా ఉంటారు. వీరు ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తిశ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు. నేడు మిధున రాశి వారు మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ధర్మ సిద్ధి ఉంటుంది. వీరు నేడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు నేడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేడు కొన్ని విషయాలలో మనోనిబ్బరం అవసరం అవుతుంది. కొన్ని సందర్భాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసరపు ఖర్చులు చేస్తారు. ఇక కీలక లావాదేవీలను, నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఈరోజు వీరికి మేలు చేస్తుంది.

సింహరాశి
సింహరాశి జాతకులకు నేడు మంచి రోజని చెప్పాలి. నేడు మీరు శుభకార్యాలలో పాల్గొంటారు. చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. సింహరాశి జాతకుల పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి వీరికి సౌఖ్యం కలుగుతుంది. వీరి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరమైన చోట సహాయం చేసే వారు కూడా ముందుకు వస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వీరు మంచిది.

కన్యారాశి
కన్య రాశి వారికి నేడు శుభప్రదంగా ఉంటుంది. నేడు వీరు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగం చేసే చోట అధికారుల సహకారం ఉంటుంది. నేడు కన్య రాశి జాతకులు మానసికంగా దృఢంగా ఉంటారు. బలమైన సంకల్పబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్ట దైవ ప్రార్థన చేయడం శుభప్రదంగా చెప్పబడింది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+