today rasi phalalu: నేడు ఈ రాశులవారికి వ్యాపారాల్లో లాభాలు; కుటుంబంలో వేడుకలు!!

గ్రహాల గమనం కారణంగా వివిధ రాశుల వారి జాతకాలు మారుతూ ఉంటాయి. నేడు గ్రహాల గమనం కారణంగా అదృష్ట రాశులు ఏమిటి? ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మేషరాశి నుండి కన్యా రాశి వరకు నేడు ఎలా ఉంధో తెలుసుకుందాం.

మేషరాశి
నేడు మేష రాశి వారికి ప్రయత్న సిద్ది ఉంటుంది. అయితే అవసరానికి తగినట్టుగా వారు ముందుకు సాగటం మంచిదని సలహా ఇవ్వబడింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుందని చెప్పబడింది. మేష రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. మేషరాశి జాతకులు నేడు శివారాధన చేయడం శుభప్రదంగా చెప్పబడింది.

వృషభరాశి
వృషభ రాశి వారికి నేడు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులతో బేధాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు. అనుకున్న పలితాలు సాధించగలుగుతారు. నేడు వృషభ రాశి జాతకులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శ్రేయస్కరంగా చెప్పబడింది.

today rasi phalalu Today these zodiac signs have business gain Celebrating with family

మిధునరాశి
మిధున రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈరోజు మిధున రాశి వారు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీరు చేసే పనులకు నలుగురిలోనూ మంచి గుర్తింపు వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభాల వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. మిధున రాశి జాతకులు విష్ణు సహస్రనామ పారాయణ ను చేస్తే మంచిది. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు ఈరోజు చాలా గొప్ప సమయంగా చెప్పవచ్చు. మీరు భవిష్యత్తు కోసం చాలా గొప్ప ఆలోచనలు చేస్తారు. కర్కాటక రాశి జాతకుల కుటుంబ సభ్యులకు కూడా మంచి సమయం. అవసరమైన చోట చాలా ధైర్యంగా ప్రవర్తిస్తారు. అయితే అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకుండా ఉండాలని సూచించబడింది. కర్కాటక రాశి వారు శివారాధన చేయడం శుభప్రదం.

సింహరాశి
సింహ రాశి వారు అనుకున్నది సాధించేవరకు పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. అయితే సింహ రాశి వారికి అవసరానికి తగిన సహాయం అందుతుంది. సింహ రాశి వారు విందులు, వినోదాలలో పాల్గొంటారు. అయితే ఏ పనైనా చేసేటప్పుడు సంపూర్ణంగా అవగాహన వచ్చిన తర్వాత చేయడం మంచిది. నేడు ఇష్ట దైవారాధన చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

కన్యారాశి
కన్యా రాశి వారు ప్రారంభించబోయే పనుల్లో ఎక్కువ అలసిపోకుండా చూసుకోవాలి. ఈరోజు కన్యా రాశి వారు బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాలలో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తే అందరి తోటి మన్ననలు పొందుతారు. నేడు కన్య రాశి వారు గణపతి మంత్రం చదివితే మంచిది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+