నేడు పంచగ్రాహి రాజయోగంతో ఈ రాశులవారికి మొదలవుతుంది ఆకస్మిక ధనయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో జనవరి 18వ తేదీన మౌని అమావాస్య. ఈ రోజు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు మరియు చంద్రులు మకర రాశిలో కలిసి పంచగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. 18వ తేదీ సాయంత్రం రాశి అయిన మకర రాశిలో సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాలకు చంద్ర సంచారం తర్వాత ఈ పంచగ్రాహి రాజయోగం ఏర్పడుతుంది.
పంచాగ్రాహి రాజయోగం
ఈ పంచగ్రాహి రాజయోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. రేపటి నుంచి ఐదు గ్రహాల కారణంగా ఏర్పడుతున్న పంచ గ్రాహి రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వచ్చే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి పంచగ్రాహి యోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు అదృష్టాన్ని చూస్తారు. భౌతిక సుఖాలను పొందుతారు. ఆకస్మిక ఆర్థిక లాభం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది . ఉద్యోగంలో ఉన్నవారికి ఈ కాలం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నంలోనూ విజయం వరిస్తుంది.
సింహరాశి
సింహరాశి వారికి పంచగ్రాహి యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ యోగం మీ జాతకంలో ఆరవ ఇంట్లో ఏర్పడడం వల్ల మీకు అన్ని విధాలా కలిసొస్తుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మంచి సమయం. ఈ సమయంలో మీ పురోగతిపైన పూర్తిగా దృష్టి పెట్టడానికి అవకాశం లభిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో విజయం సాధించవచ్చు. ఈ సమయంలో ఆకస్మిక ఆర్థికలాభాలు కలుగుతాయి.
మకర రాశి
పంచగ్రాహి యోగం మకర రాశిలోని ఏర్పడడం వల్ల ఈ జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మీ రాశిచక్రంలోని లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. అనుభవజ్ఞులైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. భవిష్యత్తులో ఇది ఉపయోగాలను చేకూరుస్తుంది అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనలను అందుకుంటారు. వైవాహిక జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వస్తాయి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications