తొలి ఏకాదశి చాలా ప్రత్యేకం.. ఉపవాసం చేస్తే కలిగే ఫలితాలివే!!
ఏకాదశి హిందువులకు అత్యంత ముఖ్యమైన తిధి. రేపు తొలి ఏకాదశి హిందువులకు ముఖ్యమైన పండుగ. దీనినే దేవశయని ఏకాదశి అని కూడా అంటారు .ఆషాడ మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా ప్రాముఖ్యమైనది. జూలై 16 మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఏకాదశి గడియలు ప్రారంభమై జూలై 17 బుధవారం సాయంత్రం ఐదు గంటల 56 నిమిషాలకు ముగుస్తుంది.
యోగ నిద్రలోకి మహా విష్ణువు
అయితే సాధారణంగా ఉదయం పూట వచ్చే తిధినే ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి జూలై 17వ తేదీ బుధవారం నాడు తొలి ఏకాదశి అని చెప్పొచ్చు. సంవత్సరం పొడుగునా వచ్చే ఏకాదశులలో ఆషాడమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకం.అయితే ఆషాడ మాసంలో వచ్చే దేవశయని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు నిద్రలోనే ఉంటాడు.

తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చెయ్యాలంటే
ఎవరైతే ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుని పూజిస్తారో వారికి అంతా శుభమే జరుగుతుంది. తొలి ఏకాదశి పండుగనాడు ఉపవాసం చేస్తే మంచిఫలితాలు ఉంటాయని చెబుతారు. అసలు తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి? అంటే ఏకాదశి అంటే 11అని అర్థం అంటే, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. ఈ రోజు ఉపవాసంతో వీటిని మనిషి తన అధీనంలో తీసుకువచ్చి భగవంతునికి నివేదన జరపాలి.
ఉపవాసంతో లాభాలివే
దీనివల్ల ఇంద్రియ నిగ్రహం పెరగడంతో పాటు, రోగాలు రాకుండా ఉంటాయి. అందుకే ఏకాదశి రోజు ఉపవాసం చేయాల్సిన అవసరం ఉందని, ఈ ఉపవాసం వల్ల నూతన ఉత్సాహం రావడంతో పాటు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. ఇక ఏకాదశి పండుగ రోజు పేలపిండిని తినడం కూడా ఎంతో మంచిది.
తొలి ఏకాదశి నాడు పేలపిండి తింటే మంచిది
ఆషాడమాసం వర్షాకాలం కావడంతో వచ్చే వాతావరణ మార్పులకు అనుగుణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పేలపిండిని తినాలి శరీరానికి వేడినిచ్చే పేలపిండి వ్యాధి ఈరోజు ఒక శక్తిని పెంచి మనలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇలా మొత్తంగా తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది.. ప్రతి ఒక్కరూ ఉపవాసంతో విష్ణువుని ధ్యానించదగినది అని చెప్పవచ్చు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications