Astrology: సింహరాశిలో బుధ సంచారం: ఈ రాశుల వారికి ఊహించని లాభం!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు అతి చిన్న గ్రహంగా చెప్పబడతాడు. బుధుడు సూర్యునికి దగ్గరగానే ఉంటాడు. ఒకే రాశిలో సూర్యుడు బుధుడు సంచారం సాధారణంగా 23 రోజుల నుండి 28 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక బుధుడు జూలై 25వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలోకి బుధ సంచారం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి లబ్ధి జరుగుతుంది.

సింహరాశిలోకి బుధ సంచారం వల్ల వృషభ రాశి జాతకులు జీవితంలో సంతోషం మరియు ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగానికి సంబంధించి మరింత సంతృప్తిని పొందే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందడంతో పాటు, వారి నుంచి మంచి ప్రోత్సాహాన్ని కూడా పొందుతారు. కొత్త కెరీర్ అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులు అధిక లాభాలను ఆర్జించే సమయం.

Transit of mercury in Leo: 3 zodiac signs are lucky; Are you in that?

సింహరాశిలోకి బుధ సంచారం వల్ల మిధున రాశి జాతకులకు లాభిస్తుంది. వీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆస్తులు కొనుగోలు చేయడం పైన ఈ సమయంలో ఫోకస్ చేస్తారు. ఉద్యోగాలకు సంబంధించి అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు మరింత లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి మిధునరాశి వారికి ఇది అనుకూలమైన సమయం.

సింహరాశిలో బుధ సంచారం వల్ల సింహరాశి జాతకులకు బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో సింహ రాశి జాతకులు తమ ఆశయాలను నెరవేర్చుకునే స్థితిలో ఉంటారు. భౌతిక సౌకర్యాలు, ఆస్తులను పొందడంపై సింహ రాశి వారు తీవ్రంగా దృష్టి సారిస్తారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ ప్రయాణాలు వారికి అధిక సంతృప్తిని ఇస్తుంది.

ఉద్యోగాలకు సంబంధించి ఈ కాలం సింహరాశి వారికి విజయాలను అందిస్తుంది. ఈ సమయంలో వారు తమ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించి తమ సామర్థ్యాన్ని సులభంగా నిరూపించుకునే స్థితిలో ఉంటారు . వ్యాపారం చేసేవారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించటానికి కూడా ఇది అనుకూలమైన సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+