Trigrahi Yoga..వీరికి కుబేర యోగాన్ని అనుగ్రహించిన శుక్ర బుధ సూర్యులు!!
ఆగస్టు 16వ తేదీన గ్రహాల రాజు అయిన సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలో సంచరించబోతున్నాడు. ఇదే రాశిలో ప్రస్తుతం శుక్రుడు, బుధుడు సంచరిస్తున్నారు. ఇ అయితే ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. శ్రావణ శుక్రవారం, అందులోనూ వరలక్ష్మీ వ్రతం చేసుకునే శ్రావణ శుక్రవారం నాడు త్రిగ్రాహి యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వారికి సిరిసంపదలను ఇస్తుంది.
త్రిగ్రాహి యోగం..నాలుగు రాశులకు లబ్ది
ఈ త్రిగ్రాహి యోగం కొన్ని రాశుల వారికి దశ మార్చబోతోంది. కొన్ని రాశులకు ఇది ఒక వరమని చెప్పొచ్చు. ఈ యోగం త్వరలో ఈ రాశులవారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది.ముఖ్యంగా మేషం, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు జాతకులు త్రిగ్రాహి యోగం కారణంగా లబ్ది పొందుతారు.

మేష రాశి
సూర్యుడు, శుక్రుడు, బుధుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరి సంపద వృద్ధి చెందుతుంది . ఏ పనులు చేసిన విజయలక్ష్మి వరిస్తుంది. చాలా సానుకూల ఫలితాలను చూస్తారు. మేష రాశి జాతకులకు చేసే ప్రతి పనిలోనూ ఉత్సాహం ఉంటుంది. . మేష రాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి
సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో వృశ్చిక రాశి వారికి లబ్ధి జరుగుతుంది. వృశ్చిక రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది వృశ్చిక రాశి జాతకులకు కలిసి వచ్చే గొప్ప సమయంగా చెప్పొచ్చు.
సింహరాశి
సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో సింహరాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన సత్ఫలితాలను పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కష్టకాలంలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువగా దృష్టి సారిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగంతో అదృష్టవంతులు అవుతున్నారు. ఈ సమయంలో పిల్లల నుండి శుభ వార్తలు వింటారు. ఆర్ధికంగా బలంగా ఉంటారు. ఉద్యోగం చేసే వారికి కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications