మే నెలలో ట్రిపుల్ త్రిగ్రాహి యోగం.. ఈ రాశులవారికి ట్రిపుల్ అదృష్టం.. పట్టిందల్లా బంగారం
గ్రహాల మార్పు కారణంగా అన్ని రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులు వస్తాయి. ప్రతినెల కొన్ని గ్రహాల సంచారం చోటుచేసుకుంటుంది. ఈ గ్రహాల సంచారం కారణంగా, వివిధ రాశులలో గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభాశుభయోగాలు ఏర్పడతాయి అయితే మే నెలలో ఈసారి మూడుసార్లు త్రిగ్రాహి యోగం ఏర్పడింది. దీనినే ట్రిపుల్ త్రిగ్రాహి యోగం అంటారు.
వివిధ గ్రహాల కలయికతో మూడుసార్లు త్రిగ్రాహి యోగం
మే 1వ తేదీన బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మే 10వ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మే 14వతేదీన అంటే నేడు సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 19న రాత్రి శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక ఈ నెలలో ఈ గ్రహాల సంచారంతో వివిధ సందర్భాలలో త్రిగ్రాహి యోగం మూడుసార్లు ఏర్పడింది. ఇది కొన్ని రాశులవారి జీవితాలలో అపారమైన సంపదను, శ్రేయస్సును తీసుకువస్తుంది.

మూడుసార్లు త్రిగ్రాహి యోగం
మే నెలలో వృషభ రాశిలో సూర్యుడు, శుక్రుడు, గురు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఆ తర్వాత బుధుడు మేషరాశిలోని లగ్న గృహంలో ప్రవేశించినప్పుడు సూర్యుడు, శుక్రుడు, బుధుడు త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరిచారు, ఇది ద్వితీయ త్రిగ్రాహి యోగం. ఆ తరువాత కుజుడు, బుధుడు, రాహువు మూడవసారి త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇలా ట్రిపుల్ త్రిగ్రాహి యోగం వల్ల మూడు రాశుల వారికి మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి.
మేష రాశి
మేష రాశి జాతకులకు ట్రిపుల్ త్రిగ్రాహి యోగం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. మేష రాశి జాతకులు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఈ సమయంలో అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు భారీ లాభాలను అర్జించే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభాలను, ఊహించని ఉద్యోగాలను పొందే అవకాశం ఉంటుంది.
వృషభ రాశి
ట్రిపుల్ త్రిగ్రాహి యోగం వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వృషభ రాశి జాతకులు వివిధ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. వీరి ఆర్థిక స్థితి బలపడుతుంది. జీవితంలో ఎటువంటి ఆర్థిక చికాకులు ఉండవు. స్థానికులు డబ్బులను ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆరోగ్యానికి అనుకూలమైన సమయం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
మిధున రాశి
మే నెలలో మిధున రాశి వారికి ట్రిపుల్ త్రిగ్రాహి యోగం కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలను పొందుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది . ఇది మీకు అదృష్టాన్ని ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications