జాతకంలో బుధుడు బలంగా ఉండాలంటే ఈ నివారణలు ట్రై చెయ్యండి
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా చెప్పే బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు మేధస్సు మరియు కమ్యూనికేషన్ కు బాధ్యత వహించే గ్రహంగా చెబుతారు. జాతకంలో బలమైన బుధ గ్రహం ఉన్న వ్యక్తులు వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. వారు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతారు.
బుధుడు జాతకంలో బలోపేతం కావాలంటే ఇలా చెయ్యండి
జాతకంలో బుధ దోషం ఉంటే, బుధుడు బలహీనంగా ఉంటే, బుధుడు బలోపేతం కావడానికి కొన్ని నివారణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ నివారణల గురించి మనం తెలుసుకుందాం. జాతకంలో బుధ దోషం ఉంటే బుధ దోష నివారణకు బుధవారం నాడు ఉపవాసం చేయడం మంచిది. బుధవారం రోజున పెసర పప్పు పొంగలి, పచ్చని అరటి పళ్ళు పేదలకు దానం చెయ్యాలి.

బుధవారం ఈ పని చెయ్యండి
బుధవారం రోజున విష్ణు మూర్తి ఆలయాలను దర్శించి విష్ణు పూజ చేస్తే జాతకంలో బుధుడు బలోపేతం అవుతాడు. బలహీనంగా ఉన్న బుధుడిని బలోపేతం చేయడానికి పెసలు, అరటిపండు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టాలి. ఇంట్లో విశాలమైన ఆకులతో ఉండే చెట్లను నాటాలి. మొదట ప్రతికూల ఫలితాల నుండి కాపాడుకోవడానికి పచ్చ ధరించాలి.
దానాలు, ధారణలు .. ఇలా ఉండాలి
పేద బ్రాహ్మణులకు ఆకుపచ్చ రంగు వస్తువులు దానం చేయాలి. బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. కుటుంబంలోని పిల్లలకు బహుమతులు ఇవ్వాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేసిన మంచి ఫలితం ఉంటుంది. . బుధ మంత్రంతో జపం చేసి మంచి పచ్చ (మరకతం)ను బుధవారం రోజు ధరిస్తే బుధ దోషాలు హరింపబడుతాయని శాస్త్రం చెబుతోంది.
బుధ గ్రహం జాతకంలో బలంగా లేనప్పుడు నపుంసకులకు లేదు అనకుండా ధర్మం చేయాలి.
పూజలు, పారాయణలు .. ఇలా చెయ్యాలి
తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రం 5 సార్లు పారాయణ చెయ్యాలి. బుధవారం రోజున పురుష సూక్తం కానీ, విష్ణు సూక్తం కానీ, నారాయణ సూక్తం కానీ పారాయణ చేయాలి. తులసి మాలను 17 బుధవారములు శ్రీవెంకటేశ్వరస్వామికి అలంకరించాలి. బుధ గ్రహ దోష నివారణకు పచ్చని మైదానంలో, ఆకు పచ్చ వాతావరణంలో కొంతకాలం గడపటం మంచిది. దానివల్ల బుధ గ్రహ దోషం తొలగిపోతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications