ఈ రాశులు మహర్జాతకులవుతున్నారంటూ రాహువు హామీ
నవగ్రహాల్లో కీలకమైన రాహువు ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఇలా మార్చే క్రమంలో కొన్ని రాశులకు మంచి ప్రయోజనాలను కల్పిస్తాడు. ఎప్పుడు సంచారం చేసినా తిరోగమన దశలోనే చేస్తాడు. వాస్తవానికి రాహువు అంటే అన్నీ ప్రతికూల పరిణామాలే ఎదురవుతాయని భావిస్తుంటారుకానీ ఆయన అనుగ్రహం ఉంటే కోటీశ్వరులవడం చిటికెలో పని. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న రాహువు వచ్చే ఏడాది కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ కూడా 18 నెలలు సంచారం చేస్తాడు. దీనివల్ల అదృష్టం కలిసివచ్చి లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు కాబోతున్న రాశులవారి వివరాలను తెలుసుకుందాం.
కన్యారాశి
వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులు తమ తోటి ఉద్యోగులు సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టుల్లో విజయాన్ని సాధిస్తారు. క్లిష్టంగా ఉన్న పిల్లల పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి అన్నివైపుల నుంచి కలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తారు. న్యాయపరమైన విషయాల్లో కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. ఆరోగ్యం పరంగా ఎటువంటి ఢోకా ఉండదు.

ధనుస్సు రాశి
శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలో రాహువు సంచారం చేస్తుండటంవల్ల ఈ రాశివారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. వ్యాపారస్తుల అభివృద్ధికి అనేక మార్గాలు తోడవుతాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉపాధికి సంబంధించి మంచి పురోగతి ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన అదృష్టవశాత్తూ ప్రారంభించి పూర్తిచేస్తారు. ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులు తీసుకోవడం ఉత్తమం. జీవితం ఆనందంగా గడుస్తుంది. మాటతీరు కాస్తంత సౌమ్యంగా మార్చుకుంటే విజయాలను చాలా సులువుగా సాధించుకుంటారు. అన్ని పనులకు ఇదే విజయసూత్రం అవుతుంది.












Click it and Unblock the Notifications