మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
2024 సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమవుతుంది. ఈసారి హిందూ నూతన సంవత్సరం మూడు శుభ రాజ యోగాలతో ప్రారంభమవుతుంది. సుమారు 30 సంవత్సరాల తరువాత ఉగాది పండుగ నాడు మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి.
సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, శష రాజయోగం ఉగాది పర్వదినం నాడు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం హిందూ సంవత్సరానికి అంగారకుడు రాజు, మంత్రి శని. ఈ పరిస్థితులలో ఈ సంవత్సరం అంతా అంగారక, శని గ్రహాల ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపైన గణనీయంగా ఉంటుంది. అంగారక, శని గ్రహాల వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరిగితే, మరికొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది.

వృషభ రాశి
ఉగాదినాడు ఏర్పడే మూడు శుభ రాజ యోగాల వల్ల వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. ఉద్యోగంలో పనిచేస్తున్న వారు మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి విజయవంతం కావడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. సీనియర్లు, సహోద్యోగులు మద్దతుతో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది.
ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగానూ, ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే అటువంటి ఆర్థిక స్తోమత ఉంటుంది. వ్యాపారస్తులకు అధిక స్థాయిలో లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిధున రాశి
మిధున రాశి వారికి ఉగాదినాడు ఏర్పడే మూడు యోగాలు లాభిస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వర్తక, వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ఆర్థికలాభాలను పొందుతారు. పాత అప్పుల బారి నుండి విముక్తి పొందుతారు. ఈ సమయంలో మీరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అవి మంచి ఫలితాలను ఇస్తాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారికి బాగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతోద్యోగుల నుండి గణనీయమైన మెప్పు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసుకునేవారు లాభాలను సాధిస్తారు. ఈ సమయం మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. దీనివల్ల మీ ధైర్యం పెరుగుతుంది. ఈ సంవత్సరం మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications