Ugadi 2025 horoscope: కుంభరాశి వార్షిక ఫలితాలు తెలుసుకోండి!
శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి గాను కుంభ రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం.
ఆదాయము-8
వ్యయము- 14
రాజ్యపూజ్యము-7
అగౌరవము- 5
కుంభ రాశి వారికి ఈ సంవత్సరంలో పితృదేవతల ఆశీస్సులు మరియు దైవానుగ్రహము ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. మీ శ్రమకి తగిన గుర్తింపు మరియు సభ గౌరవం లభిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. ఉన్నంతలో సరిపెట్టుకోవాలి.
కుంభ రాశి వారు ఈ విషయాలలో జాగ్రత్త
ప్రతి చిన్న విషయానికి ఒత్తిడి తీసుకోవడం మంచిది కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సాధ్య అసాధ్యాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. రానున్న రోజుల్లో మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు అసూయపడతారు. Nervous Systemకి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందిపడే అవకాశాలు కలవు. సంఘములో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబానికి దూరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తల్లితండ్రుల అనారోగ్య సమస్యలు మీ ఆందోళనకు కారణం అవుతాయి.

మాట్లాడేటప్పుడు జాగ్రత్త
ఎవరిని అతిగా నమ్మి జమానతు సంతకాలు చేయకూడదు, కారణం మీకు నమ్మకద్రోహం జరిగే అవకాశం కలదు. వృత్తిలో ఎదుగుదలకై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం. నూతన ఆదాయం మార్గం ప్రారంభమవుతుంది. కొన్ని సందర్భాలలో ఆవేశంలో మాట్లాడిన మాటల వల్ల ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన ప్రవర్తనలో మార్పులను గమనించి ఆనందిస్తారు. మరియు సంతాన ఎదుగుదలను ప్రోత్సహిస్తారు.
వారికి శుభవార్తలు
Photography field మరియు Software ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. పోలీస్ శాఖ మరియు Municipal Department ఉద్యోగస్తులకు అధికారుల నుంచి వత్తిడి ఉండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. Oil , Iron మరియు transportation వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకై అధిక పెట్టుబడులు పెట్టకూడదు. రవాణా శాఖ ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. Rubber industry మరియు Home needs వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
గృహ నిర్మాణ యోగం
నూతన విద్యార్థులకు course ఎంచుకునే విషయంలో Confusion కి గురవుతారు. Paralysis వ్యాధితో ఇబ్బంది పడేవారికి ఇబ్బందికరమైన కాలము. Construction రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన గృహ నిర్మాణానికి అడుగులు పడతాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి Documents సరిగ్గా ఉన్నాయా లేదా అని check చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన. క్రీడారంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు చేయి జారిపోకుండా జాగ్రత్త పడండి.
వివాహ ప్రయత్నాలలో జరిగేదిదే
Bank loans ఆలస్యం అయినప్పటికీ మంజూరు అవుతాయి. అప్పు తీర్చగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి శత్రువుల వలన రోజు ఒక కొత్త సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలం. సంతాన ప్రయత్నాలు చేసే వారికి వంశవృద్ది కలుగును. కొత్తగా వివాహం అయినటువంటి వధూవరులకు భార్యాభర్తలు వేరుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక విదేశీ పర్యటనలు చేస్తారు.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. పరిహారాలివే
కోర్టు కేసులు వాయిదా పడడం మిమ్మల్ని కొంత ఇబ్బందులకు గురిచేస్తాయి. శతభిష నక్షత్ర జాతకులు గతంలో చేసిన తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు రహస్యంగా కొంత ధనాన్ని పొదుపు చేస్తారు. ఈ రాశి గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి సంబంధించిన ఇబ్బందులు కలుగును. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు రావడం మిమ్మల్ని భయాందోళనకు గురిచేస్తాయి. ఏలినాటి శనికి మరియు రాహువు, కేతువుకు గ్రహ జపములు జరిపించి తగుదానములు ఇవ్వవలెను. ఈశ్వర ఆరాధన మరియు వీరభద్ర స్వామి ఆరాధన చెప్పదగిన సూచన.












Click it and Unblock the Notifications