Ugadi 2025 horoscope: వృశ్చికరాశి వారు ఈ ఏడాది జాగ్రత్తగా ఉండాల్సిందే!

శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి గాను వృశ్చిక రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం.
ఆదాయము-2
వ్యయము- 14
రాజ్యపూజ్యము-5
అగౌరవము- 2
వృశ్చిక రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపము, ఆవేశము ఇతరుల మీద ప్రదర్శించడం ద్వారా గౌరవం కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గృహం నందు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కలవు.

వృశ్చిక రాశి వారికి మానసిక ఒత్తిడి
బంగారము మరియు విలువైన వస్తువులు జారవిడుచుకునే అవకాశాలు కలవు కాబట్టి మీ బంధువులు గాని లేదా పరిచయస్తులు గాని మిమ్మల్ని మీ విలువైన వస్తువులు అడిగినప్పుడు నిర్మోమాటంగా, నిస్సంకోచంగా తిరస్కరించడం చెప్పదగిన సూచన. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్న వారికి స్థాన చలనము కలిగే అవకాశాలు కలవు. మీ శ్రమకి తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల మానసికపరమైన ఒత్తిడికి గురి అవుతారు.

Ugadi 2025 horoscope scorpio zodiac sign year horoscope

వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా ఇబ్బందులు
సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. శరీరానికి గాయాలయ్యే అవకాశాలు కలవు. కాబట్టి స్త్రీలు వంట చేసేటప్పుడు మరియు పురుషులు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. చెడు వ్యసనాలకు మరియు ఆలోచనలకు తావివ్వకండి. ఉద్యోగ నష్టము కలిగే అవకాశాలు కలవు. కాబట్టి ఉన్నదాంట్లో సంతృప్తి చెందడం మంచిది.

గృహ పరమైన చికాకులు
Police Department మరియు రక్షణ శాఖ వారికి మీ పై అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కునే అవకాశాలు కలవు. Food Business మరియు Medical Agencies నడిపే వారికి కొంత నష్టం కలిగే అవకాశాలు కలవు. చర్మవ్యాధితో ఇబ్బంది పడతారు. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం. దైవారాధనలో ఎక్కువ సమయం గడపాలి. మతిమరుపు వల్ల ఇబ్బందులు పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి పైరవీల ద్వారా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. గృహ పరమైన చికాకులు అధికమవుతాయి.

సంతానంతో సమస్యలు
జ్యేష్ఠ సంతాన ప్రవర్తన కొంత ఆందోళన కలగజేస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి Documents సరిగ్గా ఉన్నాయా లేదా అని check చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన. క్రీడారంగంలో ఉన్నవారికి మంచి కాలము. బ్యాంక్ లోన్స్ ఆలస్యం అవుతాయి. Real Estate వ్యాపారస్తులు అధిక పెట్టుబడులు పెట్టకూడదు. స్త్రీలు అందం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా లేదు.నూతన వధూవరులు మనస్పర్ధలకు దూరంగా ఉండాలి.

పరిహారాలివే
కోర్టు కేసులు వాయిదా పడతాయి. అనురాధ నక్షత్ర జాతకులు స్త్రీల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. నడుము నొప్పి కొంత ఇబ్బంది పెడుతుంది. జేష్ఠ నక్షత్ర జాతకులు ఎక్కువ సమయాన్ని దైవారాధనలో గడుపుతారు. వృశ్చిక రాశి వారు గురువుకి , శనికి మరియు రాహువుకి గ్రహ జపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. దుర్గ అమ్మవారి ఆరాధన మరియు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+