Ugadi 2025 rashiphal: కర్కాటక రాశి వారికి ఆస్తియోగం... మీకు తిరుగే లేదు!
ఉగాది పండుగ రానే వస్తుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మన జాతకాలు ఎలా ఉన్నాయనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాడు పంచాంగ శ్రవణం వినడం, ఏ రాశి వారికి ఏ విధంగా ఉంది? అనేది తెలుసుకోవడం పరిపాటి.
కర్కాటక రాశి వార్షిక ఫలం
2025 -2026 సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులకు ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం వారికి సానుకూల ఫలితాలు వస్తాయా లేక ప్రతికూల ఫలితాలు వస్తాయా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి జాతకులకు ఈ ఏడాది మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి ఖర్చులు తగ్గుతాయి.

ఈ ఏడాది వీరికి ఫలితం ఇలా ఉంటుంది
అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి జాతకులు అవమానాలకు భయపడకుండా ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి. 2025 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. మే నెలలో గురు గోచారం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో శని కుంభరాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తాడు. అలాగే మీనరాశిలో రాహువు తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తాడు.
కర్కాటక రాశిపై గ్రహాల సంచారం ప్రభావం
కేతువు మూడవ ఇంట్లో సంచారం చేస్తాడు. దీనివల్ల కర్కాటక రాశి జాతకులకు స్థల మార్పు కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలు మరియు విదేశీ సంబంధాలపైన దృష్టి పెరుగుతుంది. మార్చి 29వ తేదీన శని తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఉన్నత విద్య ప్రమాణాలు మరియు తాత్విక అన్వేషణలపైన కర్కాటక రాశి వారి దృష్టి మళ్ళుతుంది .
కర్కాటక రాశి వారికి గురు కటాక్షం
గురుకటాక్షం కారణంగా, వృషభరాశిలో 11వ ఇంట్లో గురు సంచారం కారణంగా ఆదాయం, సామాజిక సంబంధాలు మరియు వృత్తిపరమైన విజయాలపైన అనుకూల ప్రభావం ఉంటుంది.
కర్కాటక రాశి గుండా గురువు మిధున రాశిలోకి రావడం వల్ల వ్యక్తిగత సంబంధాలలో ఆరోగ్యం మరియు ఉద్యోగంలో చెప్పుకోదగిన మార్పులు వస్తాయి. 2025 సంవత్సరంలో ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మానసిక పరిణితి పెరుగుతుంది. ఉద్యోగ లక్ష్యాలను సాధించడంలో ముందుకు వెళతారు. ఆర్థికలాభాలు కలుగుతాయి.
కర్కాటక రాశి వారికి ఈ అదృష్టం
కర్కాటక రాశి వారి కుటుంబ జీవితం 2025లో ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. భూములు, ఇల్లు, ఆస్తులు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రణాళిక వేసుకోవడం మంచిది. గురువు చాలా సానుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో ఖర్చులు తగ్గుతాయి. పొదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి ఆరోగ్యం కూడా ఈ సంవత్సరం బాగుంటుంది.












Click it and Unblock the Notifications