డిసెంబర్ 31 వరకు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం, ఐశ్వర్యం!
జీవితంలో అనుకున్నది సాధించాలంటే మన ప్రయత్న బలంతో పాటు, గ్రహబలాలు కూడా బాగుండాలి. గ్రహాలు పాజిటివ్ గా ఉన్నప్పుడే మనం చేసే ప్రయత్నానికి తగ్గ ఫలితాలు ఉంటాయి అని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతారు.అయితే వివిధ రాశుల అధిపతులు వారి వారి అనుకూల స్థానాలలో సంచరిస్తున్న కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
డిసెంబర్ 31 వరకు అదృష్ట రాశులు
ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు గ్రహాల అనుకూల వాతావరణం కారణంగా ఏ ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఎవరు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు? ఎవరు తమ కల, ఆశయాలను నెరవేర్చుకోవడంలో ముందు వరుసలో ఉంటారు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
వృషభ రాశికి శుక్రుడు అధిపతి కావడంతో శుక్రుడు అనుకూలమైన స్థానంలో ఉండడంతో వృషభ రాశి వారికి డిసెంబర్ 31 వరకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు డబ్బు సంపాదించడానికి పడిన కష్టం ఫలితాలను ఇస్తుంది. మరో రెండు నెలలు వీరికి సంపన్న భాగ్యం కలగబోతుంది. ఈ రాశి వారి కోరికలు ఈ సంవత్సరం తప్పక నెరవేరుతాయి.
సింహరాశి
సింహరాశికి అధిపతి సూర్యుడు. రవి అధిపతిగా ఉన్న రాశి అయిన సింహ రాశి వారికి సూర్యుడు శుభ స్థానంలో ఉండడం వల్ల కలిసొస్తుంది. ఈ సమయంలో వీరు వృత్తి వ్యాపారాలలో అధిపత్యాన్ని చూస్తారు. ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థానాలను సాధిస్తారు. మరో రెండు నెలల్లో వీరికి ఆర్థికంగా లబ్ధి జరిగి అనుకున్న పనులన్నీ నెరవేరునున్నాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి అధిపతి గురువు. మరో రెండు నెలల కాలంలో గురువు యొక్క సానుకూల సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఈ సంవత్సరంలో వారు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ధనలాభం కలుగుతుంది. ఇది వీరికి అనుకూలమైన సంవత్సరం.
కుంభరాశి
కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు కావడంతో శనీశ్వరుని శుభసంచారం కారణంగా కుంభ రాశి వారికి కలిసొస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో ప్రజా సంబంధాలను మెరుగుపరచుకోవడంతో పాటు, పాలనాపరంగా గొప్ప స్థాయికి వెళతారు. సేవా రంగాలలో గుర్తింపు తెచ్చుకుంటారు. మరో రెండు నెలల్లో వీరు అనుకున్న లక్ష్యాలను సాధించి ఆర్థికంగానూ పురోగతిని చూస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications