డిసెంబర్ వరకు వీరు డబ్బు విషయంలో జాగ్రత్త.. గ్రహాల హెచ్చరిక!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు గమనం కారణంగా అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్, డిసెంబర్ నెలలలో చాలా ముఖ్యమైన గ్రహాల సంచారం జరుగుతుంది. ఇక ఈ సమయంలో శని, బుధ గ్రహాలు తిరోగమనంలో సంచరిస్తాయి. శని బుధ గ్రహాల తిరోగమన ప్రభావం వల్ల డిసెంబర్ వరకు అనేక రాశులు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేషరాశి
శని, బుధ గ్రహాల తిరోగమనం కారణంగా మేషరాశి జాతకులకు డిసెంబర్ వరకు కష్ట కాలమే. ఈ సమయంలో వీరు చేసే అన్ని పనులలోను ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేసే ఆలోచన ఉంటే మానుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు పై అధికారులతో వాదోపవాదాలకు దిగకుండా ఉంటేనే మంచిది. వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు పెరుగుతాయి.

కన్యారాశి
కన్యా రాశి వారు రానున్న రోజులలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక వ్యాధులు కన్యా రాశి వారిని ఇబ్బందులు పడతాయి. శని బుధుడు తిరోగమన సంచారం కన్యా రాశి వారి జీవితంలో ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. మానసికంగాను కన్యారాశి జాతకులు ఇబ్బందులు పడతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు డిసెంబర్ వరకు కష్టకాలం. ఈ సమయంలో వీరికి ఊహించిన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోను భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలోనూ జాగ్రత్తగా లేకపోతే నష్టపోతారు.
మకర రాశి
మకర రాశి జాతకులకు డిసెంబర్ నెల వరకు అసలు కలిసి రాదు. శని బుధ తిరోగమనం కారణంగా మకర రాశి జాతకులకు పని భారం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడి కి సంబంధించిన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకుండా ఉంటే మంచిది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోకపోతే ఆర్థిక నష్టం జరిగే ప్రమాదం ఉంది
మీనరాశి
మీనరాశి జాతకులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. డిసెంబర్ నెల వరకు మీన రాశి జాతకులు ఏ పని చేసిన దానిని సకాలంలో పూర్తి చేయలేరు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయలేని కారణంగా వీళ్లు నష్టపోతారు. ఇక భాగస్వామ్య వ్యాపారాలలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త అవసరం. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రేమ విషయంలో కూడా మోసపోయే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications