ఇంటికి వాస్తు సమస్యలు.. వాటికి పరిష్కారాలు ఇవే

ప్రతి ఒక్కరూ ఇంటిని వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు. వాస్తు ప్రకారం ఏ వస్తువు ఎక్కడ ఉండాలి? ఏ దిక్కులో ఏది ఉండాలి? తదితర విషయాలన్నింటినీ కచ్చితంగా పాటిస్తారు. అలాగే చాలామందికి రకరకాల సందేహాలు ఎదురవుతుంటాయి. వాస్తు నిపుణులు వాటికి పరిష్కారం చెబుతున్నారు. వీటిని అనుసరిస్తే మనకు వచ్చిన సందేహాలన్నీ తొలగిపోతాయి. మీకు ఇంకా పరిష్కారాలు కావాలంటే దగ్గరలో ఉన్న వాస్తు నిపుణుడిని సంప్రదించవచ్చు. అందరికీ సహజంగా వచ్చే వాస్తు సమస్యలు, వాటి పరిష్కారాలను తెలుసుకుందాం.

ఇంటికి మెట్లు ఎన్ని ఉండాలనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది. అయితే నిపుణులు చెబుతున్నదాని ప్రకారం మెట్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అయితే అవి సరిసంఖ్యలోనే ఉండాలి. మెట్ల విషయంలో వాస్తును కచ్చితంగా పాటించాలి. నైరుతి, ఆగ్నేయం, వాయువ్య దిశలో వీటిని కట్టుకోవాలి.

Vastu problems for the home Here are the solutions to them

కొంతమంది ఉన్న ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని కట్టుకుంటుంటారు. పాత ఇంట్లోని సామాగ్రిని వాడుకోవచ్చా? అనే సందేహం వస్తుంది. దీనికి నిపుణులు పాతవి వాడినా తప్పులేదని చెబుతున్నారు. అయితే చెదలు పట్టినవి, తుప్పు పట్టినవి మాత్రం వాడొద్దంటున్నారు. అంతేకాకుండా చాలా నాణ్యమైన వస్తువులనే వాడాలని సూచిస్తున్నారు. కిటికీలు, తలుపులు.. ఇలా ఏవైనా సరే పాత ఇంటివి వాడుకోవచ్చు. కానీ పైన చెప్పిన నియమాలను పాటించడం మాత్రం తప్పనిసరి.

తులసి చెట్టు ఇంటికి ఎదురుగా ఉండొచ్చా? అన్న సందేహం మాత్రం అందరికీ వస్తుంది. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఇంటి ప్రధాన తలుపునకు తులసి కోట కట్టొచ్చు. లేదంటే కుండీలో తులసి మొక్కను పెంచుకోవచ్చు. ఇది తూర్పు దిక్కులో లేదంటే ఉత్తర దిక్కులో ఉండాలి.

కొంతమంది ఇళ్లకు ఎదురుగా నీటి మడుగు, లేదంటే గుంట ఉంటుంటాయి. దీనివల్ల దోషం ఉంటుందేమో అనే సందేహం ఎదురవుతుంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటికి ఎదురుగా నీటి మడుగు, లేదంటే నీటి గుంట ఉండకూడదు. అయితే తూర్పు ఈశాన్యంలో లేదంటే ఉత్తర ఈశాన్యంలో ఉండొచ్చు. ఇంటికి ఎదురుగా ఉంటే మాత్రం దానికి పరిష్కారం చేసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+