వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్ని వాష్ బేసిన్లు ఉండాలి?

వాస్తు బాగుంటే ఇంటి యజమాని బాగుంటారు. కుటుంబ సభ్యులు బాగుంటారు. ఆర్థిక ఇబ్బందులు రావు. అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. సంతోషంగా జీవిస్తారు. అయినప్పటికీ కొన్ని కొన్నిసార్లు చికాకులు తలెత్తుతుంటాయి. వాటిని పరిష్కరించుకోవడానికి వాస్తు లోపాలేమైనా ఉన్నాయేమో చూపించుకుందామని చాలామంది వాస్తు నిపుణుల దగ్గరకు పరుగెడుతుంటారు. అలాగే చాలామంది ఇంట్లో వాష్ బేసిన్లు ఎన్ని పడితే అన్ని పెట్టిస్తుంటారు. అసలు ఇంట్లో వాష్ బేసిన్లు వాస్తు ప్రకారం ఎన్ని ఉండాలనే విషయాన్ని తెలుసుకుందాం.

ఒక ఇంట్లో ఎన్ని వాష్ బేసిన్లు అయినా ఉండొచ్చు.
సరి సంఖ్య అని, బేసి సంఖ్య అని నియామాలేం లేవు.
ఎన్ని ఉన్నా ఎటువంటి దోషం అంటదు.
ప్రతి గదిలో కూడా వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు.
ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు గోడలకు పెట్టుకోవాలి.
తూర్పు, పడమర గోడలకు పెట్టొద్దు.
అలాగే ఆగ్నేయంలోకానీ, వాయువ్యంలోకానీ పెట్టుకుంటే మంచిది.
చాలామంది ముఖం కడుక్కుంటూ ఉమ్మేస్తుంటారు.
సూర్యుడు ఉండే తూర్పు, పడమర దిక్కులవైపు ఉమ్మి వేయకూడదు.

Vastu Shastra Tips Choosing the Right Number of Wash Basins for Your Home

ఈశాన్యంలో వాష్ బేసిన్ ఉంటే కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది.
ఉత్తరంలో ఉంటే ఆర్థిక లాభాలు కలుగుతాయి.
తూర్పులో ఉంటే ఆరోగ్య సమస్యలుండవు.
నైరుతి మూల పెట్టకూడదు.
దీనివల్ల కష్టాలు, గొడవలు వస్తాయి.

చాలామంది డైనింగ్ టేబుల్ పక్కనే వాష్ బేసిన్ ఏర్పాటు చేసుకుంటారు.
డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ ఉత్తర లేదా తూర్పు గోడకు ఉండేలా చూసుకోవాలి.
వాష్ బేసిన్, డైనింగ్ టేబుల్ ఒకే వరుసలో ఉండకుండా చూసుకోవడం మంచిది.

వాష్ బేసిన్ కుళాయి నుండి నీరు నిరంతరం కారుతూ ఉండకూడదు.
ఇలా నీరు వృథా కావడం వల్ల ఇంట్లోని ధనం అనవసరంగా ఖర్చవుతుందని వాస్తు చెబుతోంది.
వాష్ బేసిన్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మురికిగా ఉన్న బేసిన్ ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.
వాష్ బేసిన్ పైన అద్దం ఏర్పాటు చేస్తే, అది ఉత్తరం లేదా తూర్పు గోడపై ఉండేలా చూసుకోండి.
అద్దం పగిలి ఉండకూడదు.

వాష్ బేసిన్ తప్పుడు దిశలో ఉంటే..
దాని కింద ఒక చిన్న ఇత్తడి పాత్రలో రాళ్ల ఉప్పు
ఉంచడం ద్వారా వాస్తు దోష ప్రభావం కొంతవరకు తగ్గుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+