ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా?

చాలామంది సొంత ఇల్లు కలిగినవారికి ఇంటిచుట్టూ ఏదో దిక్కులో ఖాళీ స్థలం ఉంటుంది. దాన్ని ఖాళీగా ఉంచడం ఎందుకులే అని గదుల్లాంటివి వేసి అద్దెకు ఇస్తుంటారు. నాలుగు డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచనతో చేస్తారు. అయితే ఏ దిక్కున ఏది కడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని వాస్తు ప్రకారం తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఇబ్బందులపాలవుతారు.

ఇంటికి నైరుతి భాగంలో ఖాళీ స్థలం ఉంటే, అక్కడ గది కట్టుకోవడం మంచిది.
ఈ గది ప్రధాన ఇంటి కంటే ఎత్తుగా లేదా సమానంగా ఉండాలి.
దీనివల్ల ఇంట్లో యజమానికి గౌరవం, ఆర్థిక స్థిరత్వం పెరుగుతాయి.
దీనిని స్టోర్ రూమ్ లేదా పడకగదిగా వాడుకోవచ్చు.

Vastu Thinking of Building a Room Just Because Space Is Available Read What Principles Says

వాయువ్యంలో ఖాళీ స్థలం ఉంటే అక్కడ గది కట్టవచ్చు.
గది గోడలు ప్రధాన ఇంటి గోడలకు తగలకుండా ఉండాలి.
దీనిని అతిథి గదిగా లేదా పెళ్లికి ఎదిగిన అమ్మాయిలు, అబ్బాయిల గదిగా వాడుకోవాలి.

ఆగ్నేయ మూలలో ఖాళీ స్థలం ఉంటే అక్కడ చిన్న గది కట్టుకోవచ్చు.
దీనిని వంటగదిగా లేదా విద్యుత్ పరికరాలు ఉంచే గదిగా వాడాలి.
ఆగ్నేయం అగ్ని స్థానం కాబట్టి, ఇక్కడ పడకగది కట్టడం అంత మంచిది కాదు.

ఈ దిక్కులో అస్సలు కట్టకూడదు.
ఈశాన్యంలో ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు.
ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా, తేలికగా, శుభ్రంగా ఉండాలి.
ఇక్కడ గది కడితే ఇంటికి వచ్చే సానుకూల శక్తి ఆగిపోతుంది.
ఇక్కడ గది కడితే ఆర్థిక నష్టాలు, సంతాన సమస్యలు
అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+