వాస్తు ప్రకారం ఇంట్లో ఈ కూరగాయ మొక్కను పెంచకూడదు.. పరిశీలించుకోండి
వాస్తు ప్రకారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం చాలామంది ఆర్గానిక్ పేరుతో ఇంట్లో స్థలం ఉంటే మొక్కలు పెంచుతున్నారు. అయితే మొక్కల ఎంపికలో ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, వాస్తు శాస్త్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కాకరకాయ మొక్క విషయంలో కొన్ని ఆసక్తికరమైన వాస్తు నియమాలున్నాయి. వాటిని తెలుసుకోండి.
కాకరకాయ అనగానే మనకు గుర్తొచ్చేది చేదు.
అది ఆరోగ్యానికి అమృతం వంటిది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో,
జీర్ణక్రియను మెరుగుపరచడంలో దీనికి సాటిలేదు.
జ్యోతిష్, వాస్తు సలహాదారుల అభిప్రాయం ప్రకారం,
ఈ మొక్కను ఇంట్లో పెంచే స్థలం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని రకాల తీగ జాతి మొక్కలు
ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి.
కాకరకాయ తీగలు ఇంటి గోడలకు పాకడం లేదా ఇంటి లోపల ఉండటం వల్ల
కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం,
అనవసరపు ఖర్చులు పెరగడం వంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.
కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు రావడం, ఇంట్లో ప్రశాంతత తగ్గడం వంటివి చోటుచేసుకుంటాయి.
గౌరవ మర్యాదలకు భంగం కలగడం లేదా ఇతరుల ముందు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం
లాంటివి ఎదురవుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాకరకాయను పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదు. వాస్తు ప్రకారం సరైన దిశలో నాటితే దోషాలు ఉండవు.
కాకరకాయ తీగలను ఎప్పుడూ దక్షిణ దిశలో నాటకూడదు.
దీనివల్ల ప్రతికూలత పెరుగుతుంది.
ఇంటి బయట, ముఖ్యంగా ఉత్తర లేదా తూర్పు దిశల్లో ఈ మొక్కను పెంచుకోవడం చాలా మంచిది.
తీగలు ఇంటి ప్రధాన గోడలకు నేరుగా అతుక్కుపోకుండా,
కొంచెం దూరంగా ఉండేలా పందిరి లేదా సపోర్ట్ ఏర్పాటు చేయడం మంచిది.
వాస్తు నియమాలను పాటిస్తూ సరైన స్థలంలో కాకరను పెంచుకుంటే
మంచి ఆరోగ్యం, మంచి వాస్తు మీ సొంతమవుతుంది.












Click it and Unblock the Notifications