Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాస్తు ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ అద్దాలున్నాయా?

కొన్ని ఇళ్లు చూడటానికి ఎంతో విలాసవంతంగా, అందంగా కనిపిస్తాయి. తీరా గదిలోకి అడుగుపెట్టగానే ఏదో తెలియని అశాంతి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీనికి కారణం మనం అలంకరణ కోసం వాడే 'అద్దాల' అమరికలో చేసే చిన్న పొరపాటేనని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెండు అద్దాలను ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంచడం అనేది కేవలం వాస్తు దోషం మాత్రమే కాదు, మానసికంగా ప్రశాంతతను పోగొడుతుంది.

వాస్తు ప్రకారం అద్దం అనేది నీటి తత్వానికి ప్రతీక.
ఇది తన ముందున్న శక్తిని రెట్టింపు చేస్తుంది.
రెండు అద్దాలను ఎదురెదురుగా పెట్టినప్పుడు ఒకదాని ప్రతిబింబం మరొకదానిలో పడి,
ఒక అనంతమైన ప్రతిబింబాల సొరంగం ఏర్పడుతుంది.
గదిలోని ఎనర్జీ ఈ రెండు అద్దాల మధ్య ఒక బంతిలా అటూ ఇటూ కొట్టుకుంటూ
అక్కడే ఉండిపోతుందేకానీ గది మొత్తం ప్రవహించదు.
ఇలా శక్తి బందీ అవ్వడం వల్ల ఆ గదిలో ఎప్పుడూ గందరగోళం, ఏదో తెలియని ఆందోళన నెలకొంటాయి.

Vastu tips According to the principles Is there more than one mirror in your house

ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది.
మన కళ్లు ఆ అనంతమైన ప్రతిబింబాలను చూసినప్పుడు,
మన మెదడు ఆ దృశ్యాలను విశ్లేషించడానికి విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది.
తెలియకుండానే మన బ్రెయిన్ అలసటకు గురవుతుంది.
దీనివల్ల ఏకాగ్రత తగ్గడం, త్వరగా చిరాకు రావడం, విశ్రాంతి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

బెడ్‌రూమ్ అనేది మనం సేద తీరడానికి ఉండే ప్రదేశం.
అక్కడ అద్దాలు ఎదురెదురుగా ఉంటే, ఆ 'లూపింగ్ ఎనర్జీ' మీ నిద్రను దెబ్బతీస్తుంది.
పొద్దున్నే నిద్రలేచినా ఇంకా అలసటగా అనిపించడం,
భార్యాభర్తల మధ్య అనవసరమైన వాదనలు పదే పదే జరుగుతుండటం వంటివి జరుగుతుంటాయి.
ఆలోచనల్లో క్లారిటీ లేకుండా చేసి, ఒకే సమస్య గురించి పదే పదే ఆలోచించేలా మారుస్తుంది.

అద్దాలను ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు గోడలకు మాత్రమే అమర్చండి.
అద్దంలో ఒక అందమైన పెయింటింగ్ లేదా ప్రకృతి కనిపిస్తే
ఆ పాజిటివిటీ రెట్టింపు అవుతుంది.
అద్దం ఎప్పుడూ చెత్తను లేదా మరో అద్దాన్ని చూపకూడదు.
ఒకవేళ అద్దాలను మార్చడం వీలుకాకపోతే,
రాత్రిపూట లేదా అవసరం లేనప్పుడు ఒక అద్దంపై
అందమైన పలచని క్లాత్ వేసి కవర్ చేయండి.
ఇలా చేయడం వల్ల ఆ గదిలో సానుకూల శక్తి స్థిరపడుతుంది.
మీ ఇంట్లో అద్దాల అమరిక ఎలా ఉందో చూసుకొని మానసికంగా ప్రశాంతంగా ఉండండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+