Vastu tips: ఈ వీధిపోటు ఉన్న ఇళ్ళలో నివసించే మగవారు లీడర్స్; వాళ్లకు తిరుగులేదు!!

వాస్తు శాస్త్రంలో వీధిపోటుకు చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఇళ్ళు కొనుగోలు చేసే సమయంలో ఖచ్చితంగా వీధిపోటు ఉందో లేదో చూసుకోవాలి. అన్ని వీధిపోట్లు డేంజర్ కాదు. కొన్ని వీధిపోట్లు ఊహించని శుభ ఫలితాలను కూడా ఇస్తాయని చెప్తారు. అందుకే వీధిపోటు ఉందంటే అది ఏ దిశలో ఉందో దాని ఫలితాలు ఎలా ఉంటాయో క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

నైరుతి వీధిపోటు అశుభ ఫలితాలని ఇస్తే ఈశాన్య వీధిపోటు మంచిని చేకూరుస్తుంది. మంచిని చేకూర్చే శుభ ఫలితాలను ఇచ్చే వీధిపోటులలో ఉత్తర ఈశాన్యం వీధిపోటు, తూర్పు ఈశాన్యం వీధిపోటు, పశ్చిమ వాయువ్యం వీధిపోటు మంచివని, శుభ ఫలితాలను ఇస్తాయని చెప్తున్నారు. ఇలా కొన్ని వీధిపోట్లు మనకు మంచి చేస్తాయి. ముఖ్యంగా మగవారికి లబ్ది చేకూరుస్తాయి.

Vastu tips: Buy this veedhipotu places or houses.. those are leaders

పశ్చిమ వాయువ్య వీధిపోటు ఉన్న స్థలాలను ఎలాంటి సంశయం లేకుండా కొనుగోలు చెయ్యొచ్చు. పశ్చిమ వాయువ్య వీధిపోటు ఉన్న స్థలాలు కొనుగోలు చేస్తే రాజకీయాల్లో వారు బాగా ఎదుగుతారు. పశ్చిమ వాయువ్య వీధిపోటు ఉన్న ఇళ్ళలో నివసించే మగవారికి బాగా కలిసొస్తుంది. వాళ్ళు మట్టి ముట్టుకున్నా బంగారమే అన్నట్టు ఉంటుందని, ఇది మగవారికి బాగా కలిసొచ్చే వీధిపోటు అని చెప్తున్నారు.

పశ్చిమ వాయువ్య వీధిపోటు ఉన్న ఇళ్ళను కొనుగోలు చెయ్యటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ దిశలో వీధిపోటు ఉన్న స్థలాలలో నిర్మాణం చేస్తే కచ్చితంగా మంచి జరుగుతుందని చెప్తున్నారు. ఈ వీధిపోటు పురుషులపై మంచి ప్రభావం చూపించే కారణంగా ఈ ఇళ్ళలో నివసించే వారికి గౌరవం దక్కుతుంది. రాజపూజ్యం పొందుతారు.

వృత్తి వ్యాపారాలలోనూ, విద్యలోనూ అభివృద్ధి కలుగుతుంది. పశ్చిమ వాయువ్య వీధిపోటుతో అధికారం వస్తుంది. అన్ని చోట్లా ఆధిపత్యం లభిస్తుంది. వాళ్ళు పట్టింది బంగారం అవుతుంది. అందుకే పశ్చిమ వాయువ్య వీధిపోటు ఉన్న ఇళ్ళను నిస్సంశయంగా కొనుగోలు చెయ్యొచ్చు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+