vastu tips: లక్ష్మీ కటాక్షం కోసమే దీపావళి.. దీపాల విషయంలో ఈ నియమాలు తప్పనిసరి!!

దీపావళి అంటే దీప కాంతులతో ప్రతి ఇంటా వెలుగులు నింపే పండుగ. చీకట్లను పారద్రోలి జీవితాలను ప్రకాశం చేసే పండుగ. ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా అందరూ ఇళ్లలో దీపాలను వెలిగిస్తారు. మట్టితో చేసిన దీపపు ప్రమిదలలో నూనెపోసి వత్తులు వేసి దీపాలను వెలిగించి ఇల్లంతా అలంకరిస్తారు. అయితే దీపాలను వెలిగించడానికి కూడా వాస్తు శాస్త్ర నియమాలు ఉన్నాయని, వాస్తు శాస్త్రం ప్రకారం దీపాలను వెలిగిస్తే దీపావళి పండుగ శుభాలను చేకూరుస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండుగ నాడు దీపాలను వెలిగించే సమయంలో ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు వంటి అనేక అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి నాడు ముందు దక్షిణాభిముఖంగా దీపాలు వెలిగించకూడదు

దీపావళి నాడు ముందు దక్షిణాభిముఖంగా దీపాలు వెలిగించకూడదు


దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరు ఇల్లంతా దీపాలను వెలిగిస్తారు. అయితే ముందుగా దక్షిణాభిముఖంగా దీపాన్ని ఎప్పుడు వెలిగించకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది అశుభం గా పరిగణించబడుతోంది అని, ఇది ఇంటికి కీడును తీసుకు వస్తుందని చెబుతున్నారు. దీపావళి పండుగనాడు ఇంటికి శ్రేయస్సును తీసుకురావడానికి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు. ఇక దీపాలను వెలిగించడానికి పొద్దుతిరుగుడు నూనెను ఎప్పుడు ఉపయోగించకూడదని చెబుతున్నారు. మనం ఇంట్లో ఉపయోగించే వంట నూనెను కూడా చాలామంది దీపాలను వెలిగించడానికి ఉపయోగిస్తారు. ఇది ఏమాత్రం మంచిది కాదని, ఇది అశుభ సంకేతమని చెబుతున్నారు.

 దీపావళి నాడు లక్ష్మీ దేవికి, గణేశుడికి స్వాగతం చెప్పండిలా

దీపావళి నాడు లక్ష్మీ దేవికి, గణేశుడికి స్వాగతం చెప్పండిలా


దీపావళి పండుగ నాడు దీపాలను వెలిగించడానికి ముందు పూజ గదిలో దీపాలు వెలిగించాలని సూచిస్తున్నారు. దీపావళి రోజున ఇంట్లోకి లక్ష్మీదేవిని, విఘ్నేశ్వరుని స్వాగతించడం కోసం ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలను ఉంచాలని సూచిస్తున్నారు. లక్ష్మీదేవి పాదముద్రలను ఇంటి లోపలి వైపుకు కనబడేలా ప్రధాన ద్వారం వద్ద వేయాలని సూచిస్తున్నారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా లక్ష్మీ కటాక్షం కోసం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని, బూజు లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. దీపాలలో వేసే ఒత్తులు కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోవాలని, మంట దీపం మధ్యలోకి రాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

దీపావళి నాడు రంగోలీలు, బహుమతుల విషయంలో జాగ్రత్త

దీపావళి నాడు రంగోలీలు, బహుమతుల విషయంలో జాగ్రత్త


ప్రతి ఒక్కరూ సంతోషంగా దీపావళి జరుపుకోవడానికి నిష్టగా పూజాదికాలు చెయ్యాలని సూచిస్తున్నారు. దేవతల విగ్రహాలు ఫోటోలను శుభ్రం చేయడానికి, శుభ్రమైన వస్త్రాలను ఉపయోగించాలని సలహా ఇస్తున్నారు. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే పాత వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదని, కొత్త వస్తువులను కొనుగోలు చేసి ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక ఇంటి గుమ్మంలో దేవతలకు సంబంధించిన ఎటువంటి రంగోలిలు వేయకూడదని చెబుతున్నారు. ఎందుకంటే రంగోలిని తొక్కుకుంటూ నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి దేవతలకు సంబంధించిన రంగోలి లను వేయకూడదు.

 వాస్తు నియమాలు పాటిస్తే దీపావళి మరింత శుభప్రదం

వాస్తు నియమాలు పాటిస్తే దీపావళి మరింత శుభప్రదం


మీ ఇంటి చుట్టూ సానుకూల ప్రకాశంతో దీపావళిని జరుపుకోవడానికి మీరు ఈ నియమాలను అనుసరిస్తే మంచి జరుగుతుందని, లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. దీపావళి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలంటే ఇంటి అలంకరణ నుండి, పండుగ నాడు దీపాలు వెలిగించే వరకు ప్రతి ఒకటి వాస్తు శాస్త్ర నియమాలను అనుసరించి చేస్తే బాగుంటుంది అని సలహా ఇస్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+