vastu tips: ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలవాలంటే ఇలా చేయండి!
ఇంటిలో లేదా కార్యాలయాల్లో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదానిపై వాస్తుశాస్త్రం పూర్తి వివరాలు చెబుతోంది.
భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టే దశ ఉంటుందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకొనే చేస్తుంటారు. ఇక ఇంటిలో లేదా కార్యాలయాల్లో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదానిపై వాస్తుశాస్త్రం పూర్తి వివరాలు చెబుతోంది.
వంటగదికి సంబంధించి రోలు.. రోకలికి వాస్తుశాస్త్రంలో వివిధ రకాల నియమాలున్నాయి. రోలుకు సంబంధించిన వాస్తు చిట్కాలను పాటించకపోతే.. కుటుంబంలో అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో రోలు, రోకలిని ఏ దిశలో ఉంచితే మంచిది.. పాటించాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం రోలు ఉంచే సరైన దిశ గురించి చెప్పింది. ఇంట్లో ఈశాన్య దిశలో రోలు, రోకలి ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ దిక్కులోకానీ, దక్షిణ దిక్కులో కానీ ఉంచరాదు. వాస్తు ప్రకారం, మీరు రోలును తప్పు దిశలో ఉంచినట్లయితే నష్టపోతారని తెలుస్తోంది.
రోలు ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ శుభ్రంగా కడుగుతుండాలి. రోలును అలాగే వదిలేయకూడదు. రోలు, రోకలిని ఎట్టి పరిస్థితుల్లో తడిగుడ్డతో తుడవకూడదు. నీటితో పూర్తిగా కడిగిన తర్వాతే శుభ్రం చేయాలి.
రోలు కడిగే సమయంలో సబ్బు, డిటర్జెంట్ వంటి కెమికల్స్ ను వాడకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. విరిగిన లేదా చీలికలు వచ్చిన రోలును ఇంట్లో ఉంచకూడదు. ఇది ప్రతికూల శక్తికి దారి తీస్తుంది.
రోకలి గోడకు స్థిరంగా ఉండాలి. దీన్ని నేలపై ఉంచకూడదు. గోడకు నిలబెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. రోలు- రోకలిని ఎట్టి పరిస్థితుల్లో విడదీయకూడదు. ఈ రెండూ ఎప్పుడూ కలిసివుండేలా చూసుకోవాలి. వీటిని విడదీయడంవల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తుతాయి.
మీరు రాయికి బదులుగా కొయ్య రోలు వాడుతుంటే అది కచ్చితంగా వేప చెక్కతో తయారై ఉండాలి. వేప శుభానికి మంచి సంకేతం. పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. దీనివల్ల మీ కుటుంబంలో ఆనందం తాండవిస్తుంది.












Click it and Unblock the Notifications