వాస్తు ప్రకారం ఇల్లు ఏ షేపులో ఉండాలో తెలుసా?
వాస్తు ప్రకారం ఇల్లు అనేది రెక్టాంగిల్ లేదా స్క్వేర్ షేపులో మాత్రమే ఉండాలి. అలాంటి ఇళ్లలో నివసిస్తే మంచి అభివృద్ధి ఉంటుంది. జీవితంలో వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారు. ఇళ్లల్లో ఉండే బెడ్ రూమ్స్ కూడా రెక్టాంగిల్ షేపులోనే ఉండాలి. బెడ్ రూమ్స్ రెక్టాంగిల్ కాకుండా వేరే షేపుల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతోపాటు అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
చతురస్రాకారం అనేది అత్యుత్తమమైనది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి చతురస్రాకారంలో ఉన్న ఇల్లు అత్యంత శ్రేష్టం.
నాలుగు వైపులా సమానంగా ఉండటం వల్ల కాస్మిక్ ఎనర్జీ ఇల్లు మొత్తం సమానంగా ప్రసరిస్తుంది.
దీనివల్ల ఇంట్లో ఉండేవారికి మానసిక ప్రశాంతతను, ఆర్థిక స్థిరత్వాన్ని, ఆరోగ్యాన్ని కాస్మిక్ ఎనర్జీ ప్రసాదిస్తుంది.

దీర్ఘ చతురస్రాకారం మంచి ఎంపిక.
చతురస్రం కుదరని పక్షంలో దీర్ఘ చతురస్రాకారంలో కట్టుకోవాలి.
ఇంటి పొడవు, వెడల్పు నిష్పత్తి 1:2 కంటే ఎక్కువ ఉండకూడదు.
వెడల్పు 20 అడుగులు ఉంటే, పొడవు గరిష్టంగా 40 అడుగుల లోపే ఉండాలి.
అంతకంటే ఎక్కువ పొడవు ఉంటే శక్తి ప్రసరణలో అసమతుల్యత ఏర్పడుతుంది.
దీనివల్ల కుటుంబ సభ్యులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కొన్ని ఆకారాలు చాలా అందంగా కనపడతాయి.
చాలామంది అలాగే కట్టుకోవాలనుకుంటారు.. కొంతమంది కట్టుకుంటారు.
గుండ్రంగా ఉండే ఇల్లు నివాసానికి పనికిరాదు.
ఇందులో నివసిస్తే మానసిక ఆందోళనలు పెరుగుతాయి.
త్రికోణాకారం లో ఇల్లు ఉంటే అగ్ని ప్రమాదాలకు లేదా కోర్టు కేసులకు దారితీసే అవకాశం ఉంటుంది.
ఎల్ షేపు లేదంటే యూ షేపు ఆకారాల్లో మూలలు కట్ అవుతాయి.
దీనివల్ల శుభ ఫలితాలు కలగవు.
ఎలా పడితే అలా కట్టడం, ఒక మూల పెరగడం,
మరోవైపు వంకరగా ఉండటం వల్ల
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు కచ్చితంగా వస్తాయి.
ఈశాన్యం మూల పెరిగినా మంచిది కానీ,
నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం మూలల్లో పెరిగితే అది వాస్తు దోషం.
ఇల్లైనా, స్థలమైనా దీర్ఘచతురస్రాకారంలో ఉంటే చాలా మంచిది.
నైరుతి మూల ఎత్తుగా ఉండాలి.. బరువుగా ఉండాలి.
ఈశాన్యంలో ఎత్తు తక్కువగా ఉండాలి.. బరువు లేకుండా తేలికగా ఉండాలి.












Click it and Unblock the Notifications