Vastu tips: గడియారాన్ని ఈ దిశలో పొరబాటున కూడా పెట్టొద్దు.. అంతా నష్టమే!!
మనిషి జీవితంలో సమయానికి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఆ సమయాన్ని సూచించే గడియారం విషయంలో కొన్ని నియమాలను పాటించాల్సి అవసరం ఉంటుంది. ఇంట్లో గడియారాన్ని పెట్టుకోవడానికి కూడా కొన్ని వాస్తు శాస్త్ర నిబంధనలు ఉంటాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో గడియారం సరైన దిశలో పెట్టకపోతే ఆ కుటుంబం అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంట్లో పాడైపోయిన గడియారాలు ఉన్నా, పగిలిపోయిన గడియారాలు ఉన్నా వాటి ప్రభావం కూడా ఆ కుటుంబ సభ్యుల పైన కచ్చితంగా ఉంటుంది. సరైన దిశలో గడియారాన్ని పెట్టడం వల్ల ఇంట్లో మంచి సానుకూల ఫలితాలను పొందుతారు. ఎంతో కష్టంగా ఉన్న పనులు కూడా గడియారం విషయంలో వాస్తు నియమాలను పాటిస్తే పరిష్కారమవుతాయి. అందుకే గడియారం పెట్టుకునే విధానంలో కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలని చెప్తున్నారు వాస్తు నిపుణులు.

ముఖ్యంగా ఇంట్లో ఎప్పుడు పగిలిపోయిన, పాడైపోయిన గడియారాలను ఉంచుకోకూడదు. ఆగిపోయిన గడియారాలు మన పురోగతిని కూడా ఆపేస్తాయి. పగిలిపోయిన గడియారాలు మనం చేసే పనిలో ఆటంకాలను కలిగిస్తాయి. అందుకే పొరపాటున కూడా ఇటువంటి గడియారాలను ఇంట్లో ఉంచుకోకూడదు. ఇక గడియారాన్ని సరైన దిశలో ఉంచితే శుభ ఫలితాలు వస్తాయి. పెట్టకూడని ప్రదేశాలలో పెడితే ప్రతికూల ఫలితాలు వస్తాయి.
గడియారాన్ని ముఖ్యంగా తూర్పు, ఉత్తర దిశల్లో పెట్టుకుంటే మంచిదని చెబుతారు. ఈ రెండు దిశలలో గడియారాన్ని పెట్టుకోవడం వల్ల ఇంట్లో వృద్ధి జరుగుతుందని బలంగా నమ్ముతారు. అందుకే ఈ దిశలలోనే గడియారం పెట్టుకోవాలి. పొరపాటున కూడా దక్షిణ దిశలో ఉన్న గోడపై గడియారాన్ని పెట్టకూడదు. దక్షిణ దిశలో ఉన్న గోడపై గడియారాన్ని పెడితే ప్రతికూల శక్తి వస్తుంది . ఇది శుభ పరిణామంగా పరిగణించబడదు.
ఇక అంతే కాదు కొన్ని గడియారాలు అదొక రకమైన శబ్దాన్ని కలిగి ఉంటాయి. ఇక ఆ శబ్దం మనసుకు ఆందోళన కలిగిస్తుంది. కనుక గడియారాలు కొనుగోలు చేసుకొని ఇంట్లో పెట్టుకునేటప్పుడు శబ్దం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. మంచి శ్రావ్యమైన ధ్వనితో ఉండే గడియారాన్ని వాస్తు నియమాలను అనుసరించి సరైన దిశలో పెట్టుకుంటే గడియారం కూడా మీ జీవిత పురోగతికి కారణమవుతుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications